భారీగా పెరిగిన ధర.. !

481
gold rate
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధర పరుగులు పెట్టింది. బంగారంతో పోటీగా వెండి ధర కూడా జిగేల్ మంది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.38,880కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.41,900 నుంచి రూ.42,410కు చేరింది.

బంగారం ధర పరుగులు పెడితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.49,200 నుంచి రూ.49,810కు ఎగసింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.35 శాతం పెరుగుదలతో 1575.80 డాలర్లకు చేరింది.

అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై పడింది. దీంతో పసిడి ధర పరుగులు పెట్టింది. అమెరికా ఫెడరల్ రిజర్వు తాజాగా కరోనా వైరస్ వల్ల స్వల్ప కాలంలో చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనమైన బంగారం వైపు మొగ్గు చూపారు. దీంతో బంగారం ధర పరుగులు పెట్టింది.

- Advertisement -