బోనమెత్తిన గోల్కొండ….

755
Golkonda Bonalu
- Advertisement -

తెలంగాణలో బోనాల పండగకు ఎంతో చరిత్ర ఉంది. తెలంగాణ ప్రజలు ఈబోనాల పండుగను ఎంతో ప్రతిష్టత్మకంగా జరుపుకుంటారు. ఆషాడంలో జరుపుకునే ఈబోనాలు మొదట గోల్కొండ కోట లో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత సికింద్రబాద్ ఉజ్జయిని మహాంకాళి లో జరుగుతాయి. ఆషాడ మాసంలో ప్రతి గురువారం, ఆదివారం బోనాల పండుగ జరుపుకుంటారు. ఇక నేడు గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభంకానున్నాయి.

లంగర్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఈ వేడుకలు ప్రారంభిస్తారు. తొమ్మిది రకాల పూజలతో బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. లంగర్‌హౌస్ చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసే వేదిక వద్ద నుంచి ఈ బోనాలను తెలంగాణ రాష్ట్రం తరఫున మంత్రులు ప్రారంభిస్తారు. దేవాదాయ శాఖ తరఫున సంబంధిత శాఖ మంత్రి లంగర్‌హౌస్ చౌరస్తా వద్ద అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

సర్కార్ బోనం ఊరేగింపునకు కూడా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారు ప్రత్యేకంగా కళాకారులతో కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. గోల్కొండ బోనాలను విజయవంతంగా నిర్వహించడానికి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రతను పెట్టారు. గోల్కొండ కోటలో జరిగే బోనాల రోజుల్లో సందర్శకులు, భక్తులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.

- Advertisement -