రాఖీ కట్టి..హెల్మెట్‌ పెట్టండి…

269
Gift helmet, save bro: K Kavitha
- Advertisement -

రాఖీ పండుగ రోజున ప్రతీ చెల్లెలు కూడా రాఖీతో పాటుగా అన్నకి హెల్మట్‌ కూడా ఇవ్వాలని ఆకాంక్షించారు ఎంపీ కల్వకుంట్ల కవిత. ‘రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు.

అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ‘రాఖీ పండుగను జరుపుకుంటారు. అయితే అదే రోజున ప్రతీ చెల్లి రాఖీతో పాటు అన్నకు హెల్మెట్‌ను కూడా ఇవ్వాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు.

 Gift helmet, save bro: K Kavitha

‘హెల్మెట్ లేకపోవడంతో ప్రతి రోజు వందలాది మంది యువకులు చనిపోతున్నారు. మనకు అన్న రక్ష, అన్నకు హెల్మెట్ రక్ష. నేను చేస్తున్న సిస్టర్ ఫర్ ఛేంజ్ నినాదానికి చాలా మంది స్పందించారు. మా అన్న కేటీఆర్‌కు బైక్ లేదు. కారులో సీటు బెల్ట్ పెట్టుకోమని చెబుతా’ అన్నారు కవిత.

 Gift helmet, save bro: K Kavitha

ఇదిలా ఉంగా గత కొన్ని రోజులుగా వస్తున్న డ్రగ్స్ అంశాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని, పేకాట, గుడుంబాలాంటి రుగ్మతలను నిరోధించినట్లు ప్రభుత్వం డ్రగ్స్‌పై కూడా ఉక్కుపాదం మోపుతుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినీ పరిశ్రమను టార్కెట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు.

కాగా..దిగ్విజయ్‌సింగ్ చేసే అరోపణలకు ఆధారాలు ఉండవని, జైరాం రమేశ్ తన మేధోసంపత్తి అంతా ఉపయోగించి ఆరోపణలు చేశారని ఎద్దేవా చేశారు. కానీ అవన్నీ తప్పులని తేలిపోయాయని అన్నారు. ‘నియోజకవర్గాలు పెరగకపోతే మాకేం నష్టం లేదు. బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసి పోటీ చేస్తాయనేది ఊహాగానాలే. నేను జగిత్యాల నుంచి పోటీ చేస్తాననే అంశం నా చేతిలో లేదు. అంతా సీఎం కేసీఆర్ ఆదేశాలపై ఆధారపడి ఉంటుంద’ని తెలిపారు ఎంపీ కవిత.

- Advertisement -