జింక ప్రాణాలు కాపాడిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది..

294
GHMC Workers save Deer
- Advertisement -

జీహెచ్‌ఎంసీ లేక్ ప్రొటెక్షన్ సిబ్బంది చెరువులో పడి మునిగి పోతున్న జింక ప్రాణాలు కాపాడారు.. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నల్లగండ్ల చెరువు రక్షణ కోసం ఏర్పాటు చేసిన సిబ్బంది పరిసర ప్రాంతాల నుండి వచ్చిన జింక నేడు ఉదయం చెరువులో పడి మునిగిపోతుoడడాన్ని గమనించారు.

GHMC Workers save Deer

దీంతో లేక్ ప్రొటెక్షన్ సిబ్బంది చెరువులోకి దిగి తాళ్ల సహాయంతో బయటకు తీసి కాపాడారు. చెరువులో నుండి తీసి కాపాడిన ఆ జింకను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. చెరువులో మునుగుతున్న జింకను సకాలంలో స్పందించి కాపాడడంతో పాటు సురక్షితంగా అటవీ అధికారులకు అందించడం పట్ల లేక్ ప్రొటెక్షన్ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి అభినందించారు.

- Advertisement -