17 తీర్మానాలకు స్టాండింగ్ క‌మిటి ఆమోదం..

597
ghmc mayor
- Advertisement -

న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న నేడు స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌తో పాటు స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్‌, ఎక్కెల చైత‌న్య‌క‌న్న,షేక్ హ‌మీద్‌, తొంట అంజ‌య్య‌, రావుల శేష‌గిరి,ఆర్‌.శిరీష‌,సామ‌ల హేమ‌,స‌బీహాబేగం పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు హ‌రిచంద‌న‌, విశ్వ‌జిత్ కంపాటి,సుజాత‌గుప్తా, అద్వైత్ కుమార్ సింద్‌,శృతిఓజా, సిక్తాప‌ట్నాయ‌క్‌,విజ‌య‌ల‌క్ష్మి, కృష్ణ‌,శ్రీ‌నివాస్‌రెడ్డిలు,శంక‌ర‌య్య‌, సురేష్‌,జియాఉద్దీన్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో ఎజెండా అంశాల‌ను ఆమోదించారు.

ghmc

స‌మావేశంలో ఆమోదించిన 17 తీర్మానాలు..

-హ‌య‌త్‌న‌గ‌ర్ స‌ర్కిల్ ఫ‌తుల్లాగూడ కృష్ణాన‌గ‌ర్ కాల‌నీ స‌ర్వే నెంబ‌ర్ 34లో ఉన్న 22,500 చ‌ద‌రపు మీట‌ర్ల‌ ఖాళీ స్థ‌లాన్ని డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ యార్డ్ ఏర్పాటుకు కేటాయిస్తూ తీర్మానానికి ఆమోదం.

-శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ లోని బొటానికల్ గార్డెన్ నుండి మ‌జీద్ బండ వ‌ర‌కు రెండు కిలో మీట‌ర్ల మార్గంలో ఉన్న సెంట్ర‌ల్ మీడియం, ట్రాఫిక్ ఐలాండ్ ల‌ను సి.ఎస్‌.ఆర్ కింద‌ నిర్వ‌హించేందుకు మేస‌ర్స్ చిరాక్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌కు కేటాయిస్తూ ఆమోదం.

-కొండాపూర్‌లోని కందికుంట చెరువులో 15కిలో కె.ఎల్‌.డి సామ‌ర్థ్యం గ‌ల వాట‌ర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సి.ఎస్‌.ఆర్ కింద ఏర్పాటు చేయ‌డానికి ఐన్‌ఫ్లాక్స్ వాట‌ర్ సిస్ట‌మ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమ‌తించే తీర్మానానికి ఆమోదం.

-శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్‌లోని మైండ్‌స్పెస్ జంక్ష‌న్ నుండి గ‌చ్చిబౌలి రోలింగ్ హిల్స్ వ‌ర‌కు సెంట్ర‌ల్ మీడియం, ట్రాఫిక్ ఐలాండ్‌ను సి.ఎస్‌.ఆర్ కింద ఒక సంవ‌త్స‌రం నిర్వ‌హించేందుకు ప‌ది బోర్డులు ఏర్పాటు చేసుకునేందుకు ఆమోదం.

-న‌ల్ల‌గండ్ల ఫ్లైఓవ‌ర్ ట్రాఫిక్ ఐలాండ్‌లు,సెంట్ర‌ల్ మీడియంల‌ను సి.ఎస్‌.ఆర్ కింద సంవ‌త్స‌రం పాటు నిర్వ‌హించేందుకు ప‌ది బోర్డులు ఏర్పాటు చేసుకునేందుకు ఆమోదం.

-శేరిలింగంప‌ల్లిలోని హ‌ఫీజ్‌పేట్ మీదికుంట‌ను అభివృద్ది, ప‌రిరక్ష‌ణ‌కు సి.ఎస్‌.ఆర్ కింద చేప‌ట్టేందుకు మేస‌ర్స్ ఫౌంటెన్ హెడ్ గ్లోబ‌ల్ స్కూల్‌కు కేటాయిస్తూ ఆమోదం.

-ఎస్.ఆర్‌.డి.పి ప‌థ‌కానికి రూపి ట‌ర్మ్ లోన్ క్రింద రూ. 2,500కోట్ల‌ను సేక‌రించ‌డానికి అరేంజ‌ర్‌గా ఎస్‌.బి.ఐ క్యాప్స్‌ను 0.10 శాతం ఫీజుతో నియ‌మించేందుకు ఆమోదం.

-జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్న బి.ఓ.టి టాయిలెట్ల నిర్వ‌హ‌ణ‌ను స‌ఫాయిక‌ర్మ‌చారిల‌కు ప‌దేళ్ల‌పాటు కేటాయించ‌డం, టెండ‌ర్ల‌లో పాల్గొనే మేత‌ర‌, వాల్మీకి వ‌ర్గానికి చెందిన‌వారికి సెక్యురిటీ డిపాజిట్‌ను రూ.50వేల నుండి రూ.20వేల‌కు త‌గ్గించే తీర్మానానికి ఆమోదం.

-స‌ఫాయిక‌ర్మ‌చారిక‌ల‌కు రూ. 10వేలుగా ఉన్న రిజిస్ట్రేష‌న్ ఫీజును రూ. 5వేల‌కు త‌గ్గించేందుకు ఆమోదం.

-హ‌య‌త్‌న‌గ‌ర్ స‌ర్కిల్ ఫ‌తుల్లాగూడ డంప్‌యార్డ్ వ‌ద్ద హిందూ, ముస్లిం, క్రిస్టియ‌న్‌ల‌కు వేర్వేరుగా శ్మ‌శాన‌వాటిక‌లు నిర్మించేందుకు రెండు ఎక‌రాల చొప్పున భూమిని కేటాయించే తీర్మానానికి ఆమోదం.

-జీహెచ్ఎంసీలో న్యాక్ ద్వారా నియ‌మితులై ప‌నిచేస్తున్న 250మంది ఔట్‌సోర్సింగ్‌ సైట్ ఇంజ‌నీర్లు, ఇద్ద‌రు సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ల సేవ‌ల‌ను మ‌రో సంవ‌త్స‌రం పాటు పొడిగించేందుకు ఆమోదం.

-ఇబ్రాహింబాగ్ తార‌మ‌తిబారాదారి ర‌హ‌దారి నుండి పెద్ద చెరువు వ‌ర‌కు రూ. 3.90 కోట్ల వ్య‌యంతో సీవ‌రేజ్ బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి ఆమోదం.

-నిజాంపేట్ రోడ్ నుండి నిజాంపేట్ క్రాస్ రోడ్ మీదుగా బాచుప‌ల్లి క‌మాన్ వ‌ర‌కు 30 మీట‌ర్ల మేర రోడ్డు విస్త‌ర‌ణ‌కు 80 ఆస్తుల సేక‌రించ‌డానికి తీర్మానం ఆమోదం.

-జీహెచ్ఎంసీ సెంట్ర‌ల్ ట్యాక్స్ విభాగంలో ప‌నిచేస్తున్న ఇద్ద‌రు రిటైర్డ్ ఉద్యోగులు కామేశ్వ‌ర‌రావు, జి.ఎన్.మ‌హేంద‌ర్ ల స‌ర్వీస్‌ల‌ను మ‌రో సంవ‌త్స‌రం పొడిగిస్తూ వారికి చెల్లించాల్సిన 2017-18, 2018-19 సంవ‌త్స‌రానికి వేత‌నాలు విడుద‌ల చేసేందుకు ఆమోదం.

-2019-20 సంవ‌త్స‌ర‌పు 14వ‌ ఫైనాన్స్ క‌మీష‌న్ ల‌క్ష్యాల నిర్థార‌ణ‌కు తీర్మానం ఆమోదం.

-జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిన నియ‌మితులైన రిటైర్డ్ ఇండియ‌న్ డిఫెన్స్ ఎస్టేట్ స‌ర్వీసెస్ అధికారి సుజాతగుప్తాకు నెల‌కు రెండు ల‌క్ష‌ల గౌర‌వ వేత‌నం చొప్పున 2019-20 సంవ‌త్స‌రానికి రూ. 24ల‌క్ష‌లు చెల్లించేందుకు ప‌రిపాల‌న సంబంధిత ఆమోదం.

-డిప్యూటి మేయ‌ర్ కార్యాల‌యం ఇంప్రెస్ట్ అమౌంట్ మొత్తం పెంపుకు ఆమోదం.

- Advertisement -