రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానాః జీహెచ్ఎంసీ

123
GHMC

ఇంట్లోని చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదని ఎన్ని సార్లు హెచ్చరించినా జనాలు మాత్రం మారడం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలు చేపడుతున్నప్పకి ప్రజలు ఇంట్లోని చెత్తను రోడ్లపై వేయడం మానడం లేదు. అల్వాల్ సర్కిల్లోని ఓల్డ్ అల్వాల్ చాకలి బస్తి లో ఒక వ్యక్తి చెత్త రోడ్డుపై వేయడానికి వెళ్తుండగా జిహెచ్ఎంసి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ గమనించింది. చెత్తను రోడ్డుపై వేయకూడదని, స్వచ్ ఆటో కు మాత్రమే అందించాలని ఆ వ్యక్తికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది.

ఈ ఒక్కసారికి రోడ్డుపై వేస్తానని ఆ వ్యక్తి అన్నప్పటికీ, లేదు తప్పనిసరిగా మాత్రమే ఇవ్వాలని సి ఆర్ పి పట్టుబట్టడంతో చిత్తము తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. అల్వాల్ సర్కిల్లో తడి పొడి చెత్తను ఇంట్లోనే వేరుచేసి స్వచ్ ఆటో లకు అందించడానికి ఉచితంగా రెండు డస్ట్ బిన్ లను అందించామన్నారు.

ప్రతి ఇంటికి స్వచ్ ఆటో వెళ్లి చెత్తను సేకరించే ఎలా పకడ్బందీ చర్యలు చేపట్టినప్పటికీ కొందరు బాధ్యతారహితంగా చెత్తను రహదారులపై వేస్తున్నారని అల్వాల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య అన్నారు. చెత్త ఆటోకు చెత్త ఇవ్వని ఇళ్లను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సాఫ్ హైదరాబాద్ శాందార్ హైదరాబాద్ లో భాగంగా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ లను నియమించామని పేర్కొన్నారు.