రివ్యూ : జార్జిరెడ్డి

1054
george reddy

జార్జిరెడ్డి… విద్యార్థి విప్లవోద్యమ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన జార్జిరెడ్డి.. సమసమాజ స్థాపనే ధ్యేయంగా పోరాటం నడిపారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన జార్జిరెడ్డిని చాలా చిన్న వయసులోనే ప్రత్యర్థులు క్యాంపస్ లోనే హత్య చేశారు. ఆయన జీవిత చరిత్ర నేపథ్యంగా తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ ఎలా ఉంది…?ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం…

కథ:

భగత్ సింగ్‌ ఎక్కడున్నారు అంటూ తన తల్లితో జార్జిరెడ్డి జరిపే సంభషణలతో మొదలవుతుంది సినిమా. చిన్నతనం నుంచే భగత్ సింగ్, చెగువేరా పుస్తకాలు చదవడంతో తన కళ్ల ముందు అన్యాయం జరిగితే సహించరు. తనను నమ్ముకున్న వారికోసం చివరి వరకు పోరాడుతాడు జార్జి.

తల్లి(దేవిక) తోడ్పాటు, సహకారంతో చదువు, విజ్ఞానంతో పాటు కత్తిసాము, కర్రసాము, బాక్సింగ్‌లో  రాటుదేలుతాడు. అయితే ఉన్నత విద్య కోసం యూనివర్సిటీకి రావడంతో అతడి జీవతం పూర్తిగా మారిపోతుంది. మాయ(ముస్కాన్‌), దస్తగిరి(పవన్‌), రాజన్న(అభయ్‌)లతో జార్జిరెడ్డికి ఏర్పడిన పరిచయం ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? ఈ పోరాటంలో సత్య(సత్యదేవ్‌), అర్జున్‌(మనోజ్‌ నందం)లతో జార్జికి ఏర్పడిన సమస్యలు ఏమిటి? తన పోరాటంలో జార్జిరెడ్డి విజయం సాధించాడా? ఇంతకి జార్జిరెడ్డిని ఎవరు హత్య చేస్తారు? అనేదే సినిమా కథ.

George Reddy Movie

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ, సందీప్‌, అభయ్‌ నటన,సెంటిమెంట్, సినిమాటోగ్రఫీ. జార్జిరెడ్డి పాత్రలో జీవించాడు సందీప్ మాధవ్. తన బాడీ లాంగ్వేజ్‌తో అచ్చం జార్జిరెడ్డిని తలపించాడు. తన పాత్రకు ప్రాణం పోశాడు సందీప్. ఇక జార్జ్ తల్లి పాత్రలో దేవిక నటన సూపర్బ్. మిగితా నటీనటుల్లో ముస్కాన్, అభయ్‌, యాదమరాజు, పవన్‌, సత్యదేవ్‌, మనోజ్‌ నందం తమ పరిధి మేరకు మెప్పించారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ మాటలు, సెకండాఫ్,స్లో నేరేషన్‌. కొన్ని చోట్ల సీన్లు అతికినట్టుగా కనిపిస్తుంది. పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ల కోసం అనేక చోట్ల ఇంగ్లీష్‌, హిందీ బాషను వాడటంతో డైలాగ్‌లు పేలలేదు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. జార్జిరెడ్డి కథను వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు జీవన్ రెడ్డిని అభినందించాల్సిందే. సినిమాటో​గ్రఫి సినిమాను మరో స్ధాయికి తీసుకెళ్లింది. యాక్షన్‌ సీన్స్‌ కూడా కొత్తగా అనిపిస్తాయి. పాటలు సన్నివేశాలకు తగ్గట్టు బాగున్నాయి. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for george reddy

తీర్పు:

దళం సినిమాతో విభిన్నమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు జీవన్ రెడ్డి. తాజాగా జార్జిరెడ్డి జీవిత కథను ఎన్నుకుని పెద్ద ధైర్యమే చేశాడు. ఎవరి మనోభావాలు కించపరచకుండా అసలు కథ డీవియేట్‌ కాకుండా కమర్షియల్‌ అంశాలను జోడించి అందరిని మెప్పించేలా సినిమా తీయడంలో సక్సెస్ అయ్యాడు జీవన్ రెడ్డి. మొత్తంగా ఈ వీకెండ్‌లో చూడదగ్గ సినిమా జార్జిరెడ్డి.

Related image

విడుదల తేదీ:22/11/2019
రేటింగ్: 2.75/5
నటీనటులు: సందీప్‌ మాధవ్‌, సత్య దేవ్,మహాతి
సంగీతం: సురేష్‌ బొబ్బిలి
నిర్మాత: అప్పిరెడ్డి
దర్శకత్వం: జీవన్‌ రెడ్డి

George Reddy was a research student in physics at Osmania University, in Hyderabad Telangana India who was murdered by his opposition on 14 April 1972