తన కూతురిని ప్రపంచానికి పరిచయం చేసిన గీతామాధురి

193
geetha-nandu

ప్రముఖ సింగర్, బిగ్ బాస్ 2 రన్నరప్ గీతా మాధురి నటుడు నందును ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇటివలే గీతా మాధురి దంపతులు పాపకు జన్మనిచ్చారు. ఆగస్ట్ 9న వీరికి పండంటి పాప జన్మించగా రీసెంట్ గా పాపకు నామకరణం చేశారు. తాజాగా ఆఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు గీతా మాధురి.

ఈసందర్భంగా తన కూతురుని పరిచయం చేసింది గీతా మాధురి. ‘అందరికి నమస్కారం, నా పేరు దాక్షాయణి ప్రకృతి. మీ గీత, నందుల బ్లాక్ బస్టర్ బేబీని నేనే’ అంటూ తన ముద్దుల కూతుర్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేశారు గీతా మాధురి. పాప ఫోటో చూసిన గీతా నందుల అభిమానులు మురిసిపోతున్నారు.

https://www.instagram.com/singergeethamadhuri/?utm_source=ig_embed