ఏడాది పూర్తి చేసుకున్న “గీత గోవిందం”

129
Geetha Govindam

మెగా నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో GA 2 పిక్చర్స్ పతకం పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన సినిమా “గీత గోవిందం”. టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ఈ సినిమా లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక మందన గోవింద్, గీత పాత్రల్లో ఒదిగిపోయారు. అలానే గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు మరొక అసెట్, వెరసి గత ఏడాది ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో నేటితో ఈ సర్ప్రైజ్ బ్లాక్ బాస్టర్ కి ఏడాది పూర్తి చేసుకుంది.

పరుశరామ్ డైరెక్షన్ స్కిల్స్

పూర్తిగా ఫ్యామిలీ తరహా సినిమాలు రూపాందించడంలో పరుశరామ్ పరిణితి సాధించేసాడు. ఈ ఎక్స్పీరియన్స్ తోనే గీత గోవిందం చిత్రాన్ని అటు యూత్ కి ఇటు ఫామిలీస్ కి నచ్చేలా తెరకేక్కిన్చాడు. థియేటర్ కి వెళ్లి హాయిగా సినిమా చూసి నవ్వుకొని, ఎంజాయ్ చేసి వచ్చే రీతిన గీత గోవిందం సినిమాను మలచడంలో పరుశరామ్ కీలకం అని చెప్పాలి. కథ ఎక్కడ గాడి తప్పకుండా అందులోనే కమర్షియల్ అంశాలు జోడించి, గీత గోవిందం ను బ్లాక్బస్టర్ సినిమాగా మార్చి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు పరుశురాం

గీతా ఆర్ట్స్ ప్రోడక్షన్ః

గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి యే సినిమా వచ్చిన, అది ఓ రేంజ్ సక్సెస్ ఇస్తుందనే నమ్మకాన్ని గీతా గోవిందం మరోసారి రుజువు చేసింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి నిర్మాణ సారథ్యంలో, బన్నీ వాసు నిర్మాతగా వచ్చిన ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంలో గీతా ఆర్ట్స్ సినిమా అనే బ్రాండ్ గీత గోవిందం పై ఉండటమే ముఖ్య కారణం.

విజయ్ దేవరకొండను ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమాః

అర్జున్ రెడ్డి తరువాత వస్తున్న సినిమా కావడం తో గీత గోవిందం పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఐతే అర్జున్ రెడ్డి ni ఎక్కువుగా యూత్ ఫాలో ఐయ్యారు. కానీ గీతా గోవిందం తో అటు యూత్ ని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఒకేసారి సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. అలానే కెర్రిర్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ కూడా గీత గోవిందం రూపం లో విజయ్ ఖాతాలోకి వచ్చి చేరింది. అలానే ఈ సినిమా లో గీత గా నటించిన రష్మిక కూడా ఓవర్ నైట్ స్టార్ ఐపోయింది.

మరుపురాని గీతం ఇంకేం ఇంకేం కావాలె

ఈ దశాబ్ధపు మరుపు రాని గీతాల్లో గీత గోవిందం మ్యూజిక్ ఆల్బమ్ లో ఉన్న ఇంకేం ఇంకేం కావాలె పాట టాప్ 3 పోసిషన్ లో ఉండటం ఖాయం. ఈ పాట రిలీజ్ ఐనా దగ్గర నుంచే గీత గోవిందం సినిమాకు వీపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పాటకు దాదాపు మూడు వందల ఏభై ఐదు మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే ఈ పాటని ప్రేకక్షులు యే రేంజ్ లో విన్నారో అర్ధం చేసుకోవచ్చు. మొత్తంగా గీత గోవిందం మ్యూజికల్ బ్లాక్బస్టర్ గా రికార్డ్స్ బ్రేక్ చేసి ఈ రోజుతో ఏడాది పూర్తి అయ్యింది.