గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా గంగూలీ

440
ganguly
- Advertisement -

బీసీసీఐ చీఫ్ సౌరభ్‌ గంగూలీ..గుడ్ విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడా బృందానికి గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఉండాలని గంగూలీని భారత ఒలింపిక్‌ సంఘం(ఐవోఏ) ఆహ్వానించింది. ఈ మేరకు దాదాకు ఐవోఏ సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా లేఖ రాశారు.

కోట్లాది మంది ప్రజలకు, ముఖ్యంగా యువతకు మీరు స్ఫూర్తిగా నిలిచారు. ఒక పాలకుడిగా యువ ఆటగాళ్లలో ప్రతిభను పెంచుతున్నారు. మీ మద్దతు ఒలింపిక్స్‌లో భారత బృందానికి ప్రేరణగా నిలుస్తుందని లేఖలో పేర్కొన్నారు మెహతా.

జపాన్‌లోని టోక్యో వేదికగా ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు విశ్వక్రీడలు జరగనున్నాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌, బీజింగ్‌ ఒలింపిక్ గోల్డ్‌ మెడలిస్ట్‌ అభినవ్‌ బింద్రా, బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్లుగా వ్యవహరించారు.

- Advertisement -