ఎప్పటికీ టీఆర్ఎస్ కార్యకర్తలమే…

403
trs

సీఎం కేసీఆర్‌ బొమ్మతోనే తాను ఎన్నికల్లో గెలిచానని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ పిలుపు మేరకే తాను టీడీపీని వీడి తెలంగాణ ఉద్యమంలో చేరానని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ మానవతావాది… శ్వాస ఉన్నంత వరకు టీఆర్ఎస్ కార్యకర్తగానే పనిచేస్తానని చెప్పారు. కరీంనగర్ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు అడిగినా కాదనకుండా ఇచ్చారని చెప్పారు.

తాను నాలుగోసారి గెలవడవానికి సీఎం కేసీఆర్,కేటీఆర్‌లే కారణమని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన వీరిద్దరి అండతోనే ఎన్నికల్లో తాను గెలిచానని స్పష్టం చేశారు. నా జీవితాంతం వారు ఏ బాధ్యత అప్పగిస్తే అది నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాను. అందరికీ న్యాయం చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారని చెప్పారు.

ఎంతో మంది సీనియర్‌ నేతలున్నా సీఎంను ప్రతిపాదించే అవకాశం నాకు కల్పించారని గుర్తుచేశారు. డిప్యూటీ సీఎం పదవి పోయినా.. ప్రభుత్వంలో అనేక రకాలుగా నన్ను ప్రోత్సహించారని చెప్పారు. నన్ను ఉద్యమ నాయకుడిగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.