‘గ్యాంగ్ లీడర్’ ప్రమోషనల్ సాంగ్.. వీడియో

293
Gangleader

నేచురల్ స్టార్ నాని- డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. అలాగే ‘ఆర్ఎస్ 100’ హీరో కార్తికేయ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

వీరితో పాటు ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిళ్లా,ప్రియదర్శి, రఘుబాబు,వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

nani

ఈ నేపథ్యలో ఈ చిత్రం నుండి తాజాగా ఓ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్‌ చేశారు చిత్రబృందం. గ్యాంగు అంటూ వచ్చే ఈ సాంగ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్‌తో కలిసి నాని స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అయితే ఈ సాంగ్ ను కంప్లీట్‌గా సినిమాలోని క్యారెక్టర్స్ గురించి చెప్పడానికి వాడుకున్నారు. సాంగ్‌లో నాని ప్రతీ క్యారెక్టర్ గురించి చెప్తూ డాన్స్ చేశాడు. మరి ఈ సాంగ్ రిలీజ్ లోపు ఏ రేంజ్‌లో పాపులర్ అవుతుందో చూడాలి.