ఫస్ట్‌లుక్‌లో ‘గ్యాంగ్ లీడర్’..

286
Gang Leader Movie First Look
- Advertisement -

మాణిక్యం మూవీస్, ఎస్.ఎమ్.కె ఫిలిమ్స్ పతాకాలపై సింగులూరి మోహన్ రావు నిర్మాతగా సిహెచ్.రవి కిషోర్ బాబు దర్శకత్వంలో బావమరదలు చిత్ర ఫేమ్ మోహన్ కృష్ణ, హరిణి రెడ్డి హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం “గ్యాంగ్ లీడర్”… మళ్ళీ మొదలవుతుంది రచ్చ అనేది టాగ్ లైన్.. మనీషా ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేతలు కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నఈ చిత్ర హీరో మోహన్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు సాగర్ చిత్ర ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయగా ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

Gang Leader Movie First Look

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సిహెచ్.రవి కిషోర్ బాబు మాట్లాడుతూ..సినిమా 30:/: కంప్లీట్ అయ్యింది.. చిరంజీవి సూపర్ హిట్ సినిమా టైటిల్ పెట్టడం వల్ల ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, సినిమాని తెరకెక్కిస్తున్నాం. ఇప్ప్పటివరకు తీసిన సినిమా అవుట్ ఫుట్ చాల బాగా వచ్చింది. చిత్రంలో 6 పాటలు వచ్చాయి. అన్ని ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉన్నాయి. త్వరలోనే ప్రేక్షకులముందుకు సినిమాని తీసుకొస్తాం అన్నారు.

హీరో మోహన్ కృష్ణ మాట్లాడుతూ…నా పుట్టిన రోజు సందర్భంగా గ్యాంగ్ లీడర్ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ అవడం ఆనందంగా ఉంది, నా అభిమాన హీరో అయిన చిరంజీవి పుట్టిన రోజు ఆగష్టు 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

Gang Leader Movie First Look

దర్శకుడు సాగర్ మాట్లాడుతూ.. గ్యాంగ్ లీడర్ అనగానే చిరంజీవి గారి సినిమా గుర్తొస్తుంది..ఆ సినిమా మెగా స్టార్ కి ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో అంతే మంచి పేరు ఈ చిత్ర హీరో కి , దర్శకుడికి, ప్రొడ్యూసర్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ఫస్ట్ లుక్ పోస్టర్ చాల ఇంప్రెసివ్ గా ఉంది.. సినిమా అవుట్ పుట్ కూడా అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను అన్నారు.

Gang Leader Movie First Look

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. సినిమా మోషన్ పోస్టర్ చాల బాగుంది.. చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఆ సినిమా లాగే సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సినిమా కోసం అందరు చాల కష్టపడ్డారని సినిమా లుక్స్ చూస్తుంటే తెలిసిపోతుంది.. అల్ ది బెస్ట్ టూ టీం అన్నారు..

- Advertisement -