రివ్యూ : గేమ్‌ ఓవర్

332
game over movie review

హీరోయిన్‌ ‘తాప్సి’ ప్రధాన పాత్రలో తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’నిర్మించిన చిత్రం ‘గేమ్ ఓవర్’.తెలుగు,తమిళం,హిందీ భాషలలో ఏక కాలంలో ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. నయనతార ప్రధాన పాత్రలో మాయ చిత్రాన్ని తెరకెక్కించిన అశ్విన్‌ శరవణన్‌..తాప్సీతో గేమ్‌ ఓవర్‌ను తెరకెక్కించాడు.మరి గేమ్ ఓవర్‌తో తాప్సీ సక్సెస్ సాధించిందా లేదా చూద్దాం…

కథ :

అమృత (సంచన నటరాజన్‌) అనే అమ్మాయిని చంపే సీన్‌తో మూవీ ప్రారంభమవుతుంది. స్వప్న (తాప్సీ పన్ను) వీడియో గేమ్ డిజైనర్‌. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాల కారణంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆత్మహత్య ప్రయత్నం కూడా చేస్తోంది.సీన్ కట్ చేస్తే ఆత్మహత్య తర్వాత స్వప్న జీవితం ఎలాంటి మలుపు తిరిగింది..?స్వప్నకి అమృతకి ఉన్న సంబంధం ఏంటీ..?అన్నది తెరమీద చూడాల్సిందే.

Image result for game over taapsee

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ తాప్సీ,స్క్రీన్‌ప్లే. సినిమాను ఒంటిచెత్తో నడిపించింది తాప్సీ.. స్వప్న పాత్రలో తనదైన నటనతో ప్రాణం పోసింది. లుక్‌, యాక్షన్‌, ఎమోషన్స్‌ ఇలా ప్రతీ విషయంలో పర్ఫెక్షన్‌ చూపించింది. తన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన వినోదిని వైద్యనాథన్‌ కలమ్మ పాత్రకు పర్ఫెక్ట్‌గా సూట్‌ అయ్యారు. అశ్విన్‌, కావ్యలు అందించిన స్క్రీన్‌ప్లేనే సినిమాకు హైలైట్‌గా నిలిచింది. అనీష్‌ కురివిల్లా, రమ్య సుబ్రమణ్యం, సంచన నటరాజన్‌ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఫస్ట్‌ హాఫ్‌,స్లో నెరేషన్‌. ఎంచుకున్న కథ చిన్న పాయింట్ కావడంతో ఫస్ట్ హాఫ్‌లో కథ ఏమీ లేదన్న ఫీలింగ్‌ కలుగుతుంది. సెకండాఫ్‌ ఆసక్తికరంగా ఉందనుకునేలోపే సినిమా ముగుస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. మర్షియల్‌ ఫార్ములా అంటూ సాంగ్స్‌, కామెడీ ఇరికించకుండా పర్ఫెక్ట్ థ్రిల్లర్‌గా సినిమాను రూపొందించటం ఆకట్టుకుంది. సినిమాకు ప్రధాన బలం సినిమాటోగ్రఫి, వినోద్‌ కెమెరా వర్క్‌, రాన్ ఏతాన్ యోహన్ మ్యూజిక్‌. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for game over taapsee

తీర్పు:

సెన్సిబుల్‌ ఇ‍ష్యూస్‌ను టచ్‌ చేస్తూ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌తో అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన చిత్రం గేమ్ ఓవర్. తాప్సీ నటన,స్క్రిన్ ప్లే సినిమాకు ప్లస్ పాయింట్ కాగా స్లో నేరేషన్ మైనస్ పాయింట్స్‌..  తాప్సీ తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. దర్శకుడు అశ్విన్ ఎక్కడ గ్రిప్పింగ్ మిస్ కాకుండా, ప్రేక్షకులను తన ప్రతిభ తో మెప్పించాడు. థ్రిల్లర్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ పండించి అందరిని ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఈ వీకెండ్‌లో అందరు తప్పకుండా చూడవలసిన మూవీ గేమ్ ఓవర్.

విడుదల తేదీ:14/06/2019
రేటింగ్:3.25/5
నటీనటులు : తాప్సీ, వినోదిని వైద్యనాథన్‌, అనీష్ కురివిల్లా,
సంగీతం : రాన్ ఏతాన్ యోహన్
నిర్మాత : ఎస్. శశికాంత్‌, చక్రవర్తి, రామచంద్ర
దర్శకత్వం : అశ్విన్‌ శరవణన్‌