గేమ్ ఓవర్… ట్విట్టర్ రివ్యూ

266
taapsee

ప్రముఖ కథానాయిక ‘తాప్సి’ ప్రధాన పాత్రలో తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’నిర్మించిన చిత్రం ‘గేమ్ ఓవర్’.ప్రపంచ వ్యాప్తంగా 1200 కు పైగా స్క్రీన్స్ లో తెలుగు,తమిళం,హిందీ భాషలలో ఏక కాలంలో ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది.

సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా బాగుందని ట్వీట్ చేస్తున్నారు. సినిమా చాలా ఎంగేజింగ్‌గా ఉందని అంటున్నారు. ఒక ప్రేక్షకుడు అయితే గడిచిన పదేళ్లలో తాను చూసిన బెస్ట్ థ్రిల్లర్ అని కితాబిచ్చేశారు. ఇక తాప్సీ నటన అయితే అద్భుతమట. ఆమెకు నేషనల్ అవార్డు రిజర్వ్ అయిపోయిందని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు.

అశ్విన్ శరవణన్ రాసుకున్న కథ, దాన్ని తెరపై చూపించిన విధానం అద్భుతంగా ఉందంటున్నారు. మొత్తం మీద సినిమా అయితే ఒక మాస్టర్ పీస్ అని కొనియాడుతున్నారు. ఇంత మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది ‘గేమ్ ఓవర్’.ప్రముఖ బాలీవుడ్ రచయిత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి హిందీలో సమర్పకుడుగా వ్యవహరిస్తూ ఉండటం మరో విశేషం.