కాంగ్రెస్ కు షాక్..బీజేపీలోకి చిరంజీవి

495
chiranjeevi
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు బీజేపీ నేతలు. పలు పార్టీల్లో అసంతృప్తులుగా ఉన్న నేతలందరిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆపరేషన్ కమలం పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇటివలే ఏపీలో నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇక అదే బాటలో మరికొందరు నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

మరోవైపు, ఏపీ రాజకీయాల్లో కీలక వ్యక్తిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మాజీ కేంద్రమంత్రి , మెగాస్టార్ చిరంజీవి కూడా బీజేపీ కండువా కప్పుకోనన్నట్లు తెలుస్తుంది. బీజేపీ నేతలు ఇటివలే కాపు సామాజిక వర్గ నేతలతో భేటీ అయిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 74 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో చిరంజీవిని పార్టీలోకి తీసుకుని, అవసరమైతే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని కూడా అప్పజెప్పాలని కాషాయ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఆయన సైరా నరసింహరెడ్డి మూవీలో నటిస్తున్నారు. ఈమూవీ అక్టోబర్ 2న విడుదల కానుంది.

- Advertisement -