చేనేత బతుకమ్మ పోస్టర్ లాంచ్‌..

459
k kavitha
- Advertisement -

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆద్వర్యంలో సెప్టెంబర్ 28వ తేదీనాడు నిర్వహిస్తున్న “లండన్- చేనేత బతుకమ్మ- దసరా ” వేడుకల పోస్టర్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,మాజీ ఎంపీ కవిత ఆవిష్కరించారు.

నేడు హైదరాబాద్‌లో టాక్ ప్రతినిధుల బృందం మాజీ ఎంపీ కవితను కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడానికి చేస్తున్న కార్యక్రమాలకు స్పూర్తితో, గత కొన్ని సంవత్సరాలుగా టాక్ జరిపే బతుకమ్మ వేడుకలను “చేనేత బతుకమ్మ”గా నిర్వహిస్తున్నామని, వీలైనంత వరకు ప్రవాసులల్లో చేనేతపై అవగాహన కలిపించి,వీలైనన్ని సందర్భాల్లో చేనేత వస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నట్టు తెలిపారు.

చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు కవిత. లండన్ నుండి టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మరియు టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది ఫోన్ ద్వారా మీడియాకి తమ సందేశాన్నిస్తూ, టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాలలో కవిత ప్రోత్సాహం చాలా గొప్పదని, నేటి “చేనేత బతుకమ్మ” పోస్టర్ ఆవిష్కరించి మాలో నూతన ఉత్సాహాన్ని నింపిన కవితకి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేస్తినట్టు చెప్పారు.

TAUK_Bathukamma_poster

అన్నివేళలా వారి సూచనలు సలహాలు మాకెంతో ప్రోత్సహాన్ని కలిగిస్తున్నాయని , చేనేత కుటుంబాల సంక్షేమం పట్ల వారికి ఎంత శ్రద్ధ ఉందని, ఇటువంటి కార్యక్రమాల వల్ల వారికి వీలైనంత చేయూత అందితే చాలా సంతోషమని కవిత అభిప్రాయపడ్డట్టు తెలిపారు.

సెప్టెంబర్ 28వ తేదీనాడు ఎంగిలి పూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభమవుతాయని కాబట్టి లండన్‌లో నివసించే ప్రవాస ఆడబిడ్డలంతా వేడుకల్లో పాల్గొని బతుకమ్మకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుదామని, ఈ సంవత్సరం సాయంకాలాన మన ఊర్లో జరిగినట్టు వేడుకులు నిర్వహిస్తున్నామని, ప్రవాసులంతా సాయంత్రం 4 గం. ల నుండి వెస్ట్ లండన్ లోని ” ఐసల్ వర్త్ అండ్ సయాన్ స్కూల్” ఆడిటోరియంలో జరిగే వేడుకలకు, ప్రవాస బిడ్డలంతా వీలైతే చేనేత దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొనాలని, మనమంతా చేనేతకు అండగా నిలవాల్సిన చారిత్రాత్మక సమయమిదని తెలిపారు.

చేనేత వాస్త్రాలకై www.tauk.org.uk వెబ్సైట్‌ను సందర్శిస్తే వివరాలు ఉన్నాయని తెలిపారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చేనేత చీరలను అందిస్తుందని, మనమంతా మన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న అన్ని బతుకమ్మ వేడుకల్లో, చేనేతకు ప్రాధాన్యతనిస్తూ, చేనేతదుస్థలతో వేడుకలను జరువుపుకుంటే, చేనేత కుటుంబాల్లో గొప్ప భరోసా వస్తుందని తెలిపారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మల్యే విద్యాసాగర్ రావుకి మరియు టాక్ ప్రతినిధులు నవీన్ రెడ్డి, సుప్రజ పులుసు, రవి ప్రదీప్ పులుసు, రాజ్ కుమార్ శానబోయిన, మల్లేష్ పప్పులకి కృతఙ్ఞతలు తెలుపుతూ, అలాగే నేటి కార్యక్రమానికి సహకరించిన జాగృతి నాయకుడు సంతోష్ రావు కొండపల్లికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

- Advertisement -