కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందిః హరీష్ రావు

322
Harish Kaleshwaram
- Advertisement -

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించగా, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ , ఏపీ సీఎం జగన్, మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఇక కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో నిర్వహించిన కాళేశ్వరం సంబురాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గోన్నారు. ఈసందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో మనం ఒక్క ప్రాజెక్ట్ కూడా నిర్మించుకోలేకపోయామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో కేవలం 3ఏండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తీ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గనుక అధికారంలో ఉంటే 30ఏళ్లు గడిచినా ప్రాజెక్ట్ కట్టకపోయేవారని విమర్శించారు. మూడేళ్లలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో సాగునీరు ఇస్తామని వెల్లడించారు. ప్రాజెక్ట్ ల కోసం ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు ఎంతో మంది కష్టపడ్డారు. ప్రాజెక్ట్ ల కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దసరా పండగ ఎంత ముఖ్యమో ఇవాళ కాళేశ్వరం పారంభం కూడా అంతే ముఖ్యమన్నారు.

- Advertisement -