చంద్రబాబుకు షాక్… బీజేపీలోకి 15మంది ఎమ్మెల్యేలు

210
Chandrababu-Ganta-Srinivasa

ఏపీలో ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. 23 అసెంబ్లీ స్ధానాలతో పాటు 3 పార్లమెంట్ స్ధానాల్లో విజయం సాధించింది. ఇక నిన్న ఆ పార్టీకి చెందిన 4గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక ఈ షాక్ నుంచే కోలుకోక ముందే టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తుంది.

మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు బీజేపీలోకి వెళ్తున్నట్లు సమాచారం అంతేకాకుండా ఆయనతో పాటు 15 మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 15మంది ఎమ్మెల్యేలతో కలిపి గంటా శ్రీనివాస్ రావు శ్రీలంకలోని కోలంబో ఉన్నారని..వారంతా నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

అయితే ఆ 15మంది ఎమ్మెల్యేలు ఎవరూ అనేది ఇంకా తెలియలేదు. గెలిచిన 23మందిలో 15మంది పార్టీ మారితే టీడీపికి ప్రతిపక్ష హోదా కోల్పొయినట్లే. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విదేశాలకు వెళ్ళిన తర్వాత పార్టీ ఫిరాయింపులు జరుగుడంతో టీడీపీ వర్గాల్లో చర్చాంశంనీయంగా మారింది.