అదో చెత్త రూల్..ఐసీసీపై గంభీర్ ఆగ్రహం

408
Gambir on Icc
- Advertisement -

ఉత్కంఠ బరితంగా సాగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కప్ ఇంగ్లాండ్ కు వెళ్లినా..న్యూజిలాండ్ మాత్రం ప్రజల మనసును గెలుచుకుంది. 44ఏండ్ల తర్వాత ఇంగ్లండ్ కు ప్రపంచకప్ వరించింది. ఇరుజట్లు సమిష్టిగా రాణించిన ఈ మ్యాచ్ లో మ్యాచ్ డ్రా గా నిలిచింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ లో కూడా మ్యాచ్ టైగా నిలిచింది.

దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్‌ జట్టును విజేతగా ప్రకటించారు. ఐసిసి తీసుకున్న ఈనిర్ణయంపై పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఓటమి మమ్మల్ని నైరాశ్యంలోకి నెట్టిందని మ్యాచ్ అనంతరం ఆ టీం కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అన్నాడు.

తాజాగా బౌండరి కట్ నిబంధంనపై స్పందించారు ఇండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గౌంభీర్. ఐసీసీ తీసుకున్న నిర్ణయం సరైందని కాదని చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బౌండరీల ద్వారా విజేతను ప్రకటించడంపై గంభీర్‌ ఐసీసీ తీరును తప్పుపట్టారు. ఈ తరహా విధానం సరైనది కాదంటూ విమర్శించాడు. ఇదొక చెత్త రూల్‌ అంటూ మండిపడ్డాడు.

- Advertisement -