వైఎస్ జయంతి..రైతు దినోత్సవంగా ప్రకటించిన సీఎం జగన్

505
jagan
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవినీతికి తావు లేకుండా పరిపాలన చేయాలని అధికారులకు సూచించారు. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం రోజున రైతు దినోత్సవంగా ప్రకటించింది ఏపీ సర్కార్.

ఇక నుంచి ప్రతి ఏటా వైఎస్ జయంతి అయిన జూలై 8వ తేదీన రైతు దినోత్సవంగా నిర్వహిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రకటించారు. అలాగే పంటల భీమా, రైతులకు వడ్డీ లేని రుణం తదితరాలకు సంబంధించిన చెల్లింపుల అంశాలను ఆ రోజుకు సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

వైఎస్సార్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఆ రోజు పండుగలా నిర్వహించాలని సూచించారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.12,500 పెట్టుబడిని అక్టోబర్ 15వ తేదీన రాష్ట్రమంతా ఒకే రోజు చెల్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు

- Advertisement -