విండీస్‌ను తిప్పేసిన ఇషాంత్…

721
ishanth sharma
- Advertisement -

విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ అయిన భారత్‌ తర్వాత విండీస్‌ను కట్టడిచేయడంలో సక్సెస్ అయింది. రెండోరోజు ఆటముగిసే సమయానికి కరెబియన్లు 8 వికెట్లు కొల్పోయి 189 పరుగులు చేసింది.

​​​​​​ఇన్నింగ్స్‌ మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువసేపు నిలుపుకోలేకపోయింది. క్యాంప్‌బెల్‌(23) ,బ్రాత్‌వైట్‌(14), బ్రూక్స్(11) ,డారెన్‌ బ్రావో(18) తక్కువ స్కోరుకే వెనుదిరిగిన రోచ్‌ ఒంటరి పోరాటం చేశాడు. రోచ్‌(48),షై హోప్‌(24),హెట్‌మైయర్‌(35) పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో హోల్డర్‌(10),కమిన్స్ ఉన్నారు. ఇషాంత్‌ శర్మ 5 వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించాడు.

బ్రావోను పెవిలియన్‌కు పంపడం ద్వారా బుమ్రా టెస్టు క్రికెట్‌లో 50 వికెట్ల ఖాతాలో చేరాడు. 11 టెస్టుల్లోనే అతని ఈ రికార్డు అందుకోవడం విశేషం.టెస్టుల్లో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం ఇషాంత్‌కిది తొమ్మిదోసారి. వెస్టిండీస్‌పై మూడోసారి.

అంతకముందు తొలి రోజు 203/6 పరుగుల ఓవర్‌ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జడేజా రాణించడంతో 297 పరుగులు చేయగలిగింది పంత్‌ (24) ,ఇషాంత్‌ (19 )కి తోడు డేజా(58) అద్భుత పోరాటం చేశాడు.విండీస్‌ బౌలర్లలో రోచ్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

- Advertisement -