‘జాను’ నుండి ‘ప్రాణం’ సాంగ్..

563
jaanu movie
- Advertisement -

శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘జాను’. ఈ చిత్రం ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోంది. తమిళంలో విజయవంతమైన ’96’ మూవీకి ఇది రీమేక్. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. గోవింద్ వసంత సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఇక మంగళవారం (జనవరి 21న) సాయంత్రం 5 గంటలకు ‘ప్రాణం’ అనే సింగిల్ సాంగ్ ను వదలనున్నారు. సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

jaanu

’96’ మూవీలోని విజయ్ సేతుపతి పాత్రను శర్వానంద్ పోషిస్తుండగా, త్రిష పాత్రలో సమంత కనిపించనుంది. తమిళ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. వైవిధ్యభరితమైన ఈ సినిమాపట్ల నిర్మాతగా ‘దిల్’ రాజు ఎంతో నమ్మకంతో వున్నాడు. ఇక శర్వానంద్, సమంత ఇద్దరూ కూడా ఈ సినిమా తమ కెరియర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని భావిస్తున్నారు.

- Advertisement -