న్యూ జీలాండ్‌లో మొదటి సాహితీ సదస్సు..

431
Tanikella Bharani
- Advertisement -

2018 నవంబరు నెలలో మెల్బోర్న్ నగరంలో జరిగిన లోక్ నాయక్ ఫండేషన్ (విశాఖపట్నం) మరియు వంగూరి ఫండేషన్ (అమెరికా) వారి 6వ ప్రపంచ సాహితీ సదస్సు ఆస్ట్రేలియా మరియు న్యూ జిలండ్ దేశాలలోని తెలుగు భాషాభిమనులందరినీ ఒకే త్రాటిపై నడిపంచి సాహితీ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచింది. ఇక్కడి తెలుగువారిలో ఉన్న సాహితీ తృష్ణను తటిలేపి సమిష్టిగా ఒక సుధీర్ఘ ప్రణాళికా రచనకు ప్రోతుహించింది. ఈ ప్రక్రియలో భాగంగా న్యూ జిలండ్ మరియు ఆస్ట్రేలియా దేశాలలోని తెలుగు భాషాభిమానులు ప్రతీ ఏటా ఇక్కడి ముఖ్యా పట్టణాలలో ఒక సాహితీ సదస్సు నిర్వహించాలన్న నిర్ణయానికి పర్యవసానంగా నవంబరు 16వ తేదీన ఈ సదస్సు అంగరంగ వైభోగంగా ప్రారంభమైనది.

First literary conference

మొదటి రోజు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రారంభోపన్యాసము చేస్తూ ‘ఆంగల భాషను నేర్చుకండి, ఆదరించండి కానీ తెలుగు భాషను మరువకండి’, ఆంగల భాష వ్యామోహంలో పడి ఆ పదాలనే తెలుగులో వాడడం వలన మన భాష ఉనికి దెబోతింటందని చెప్పారు. ఉదాహరణకు తిరుపతి దేవస్థానంలో నిరవహించే ఎన్నో సేవలు ఇప్పుడు ఆంగల పరిభాషలో వాడుతున్నారని ‘శ్రీవారి పద సేవ’ SVP అయిపొయింది. మహాత్మా గాంధీ రోడ్ MG Roadగా మారిందని మరికొంత కాలం తరువాత ఈ ఆంగ్ల పదాల వెనుక దాగి ఉన్న గూదార్ధం ప్రజలు పూర్తిగా మరచిపోతారని అన్నారు. ఇక్కడి జన్మభూమికి కన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న న్యూ జిలండ్‌లో జరుగుతున్న ఈ సాహితీ సదస్సు రెండురోజుల ఉత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య ప్రవేశ పెట్టిన ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల విద్యబోధన అల్పాదాయ వర్గాల వారికి ఉపయోగపడాలన్న ఉదేశంతో ప్రారంభింపబడిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుతవం మైస్తరులోని తెలుగు పరిశోధనా కేంద్రం నెల్లురుకు తరలించడం జరిగిందని చెప్పారు.

విశిష్ట అతిథిగా విచేుసిన ప్రముఖ నటలు, దర్శకులు, రచయిత తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. తెలుగు భాష ప్రపంచ భాషలోల ఒకటిగా ఎదిగిందని చెప్పడానికి ఈ సదస్సు సంకేతమని అభివరిణంచారు. ఎందరో మహా కవులు రచించిన ఉద్ర్గంధాలు, కావ్యాలు, పద్యాలు మనకి ఆదర్శనీయమని అన్నారు. భరణి శివ తత్వాలు పాడి ప్రేక్షకులను అలరించారు.

First literary conference

గౌరవ అతిథిగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పూర్వపు ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ ‘సాహిత్యం–సమాజిక ప్రయోజనం’ విషయంపై కూలంకుషంగా మాటాలడారు. వారి బాల్యం నుమాయిషీలతో కూడుకున్నదని అప్పుడు ఇంటినిండా మనుషులుంటే ఇప్పాడు ఇంటినిండా వస్తవులుంటున్నాయని మాట్లాడడానికి మనుషులు కనిపంచక సెల్ ఫోనులతో మాట్లాడుకోవలసి వస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని అనేక దేశాల నుండి వక్తలు, ప్రతినిధులు వచ్చారు. వారిలో ముఖ్యంగా మలేషియా నుండి 28 మంది (పిల్లలతో సహా) ప్రతినిధులు డా. అచ్చయ్య కుమార్ అధ్వర్యంలో వచ్చి మలేషియా వారి జీవన విధానం బుర్రకథగా చెప్పడం ఎంతో ఆనందకరమైన విషయం. వారందరూ ఎంతో క్రమశిక్షణతో వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. మారిషస్ దేశం నుండి సంజీవప్పడు వచ్చి మారిషస్ దేశంలో తెలుగు భాషాభివృద్ధికి జరుగుతున్న పథకాల గురించి మాటాలడారు.

ఉపాధ్యాయుల సత్కారం..

ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాల నుండి వచ్చిన ఉపాధ్యాయులను సత్కరించడం జరిగింది. ఆస్ట్రేలియా మరియు న్యూ జీలండ్ దేశాలలో సుమారు 600 మంది పిల్లలు తెలుగు బడులలో తెలుగు నేర్చుకుంటన్నారు.మలేషియా దేశంలో సుమారు 400 మంది పిల్లలు తెలుగు నేర్చుకోవడం ఎంతో ముదావహం.

పుస్తక ఆవిష్కరణలు..

ఈ సదస్సులో ప్రత్యేకించి కళ్యాణ్ తటవర్తి ఈ సదస్సుపై ‘న్యూ జీలాండ్ శతకం’ పేరిట తేటగీతిలో 108 పద్యాలు వ్రాసి ఆవిష్కరించడం ఒక ముఖ్య ఘట్టం. అలగే ఉమా మహేష్ శనగవరపు వారు రచించిన ‘అక్షర విజ్ఞానం’, నేతి శివ రామకృష్ణ శాస్త్రి మరియు కర్రా శర్మ రచించిన ‘న్యూ జీలండ్’ కాలమానానికి సరిపోయే పంచాంగం కూడా ఆవిష్కరించబడింది. రమాకాంత్ రచించిన ‘వాసంత సమీరాలు’ పుస్తకం కూడా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మరియు తనికెళ్ళ భరణి చేతుల మీదుగా అవిష్కరించబడ్డాయి.

First literary conference

ప్రసంగాలు..

వివిధ దేశాల నుండి వచ్చిన వక్తలు మన కవులు మరియు మన భాషా సంస్కృతులపై ప్రసంగాలు చేశారు.ఇందులో విశ్వనాథ సతూనారాయణ,సి.నా.ర., బాలసాహిత్యం, మన భాషా సంస్కృతులున్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాలు..

సాయంకాలం ఆస్ట్రేలియా భువన విజయం వారు ప్రదర్శించిన శ్రీకృష్ణదేవరాయల భువన విజయం నాటకం ప్రజారంజకంగా అందరినీ ఆకట్టుకున్నది. స్థానికులు తెలుగు భాషపై జానపద నృత్యం ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించింది. శ్రీకృష్ణ రావిపాటి చేసిన ‘దుర్యోధనుడు’ ఏకపాత్రాభినయం ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. తనికెళ్ళ భరణి శివ తత్వాలు మొదటి రోజు సమావేశం ముగిసింది.

సదస్సు ప్రధాన ఆశయాలు..

1.ముఖ్యంగా ఆస్ట్రేలేసియా ప్రాంతంలో ఉన్న దేశాలలో నివశిస్తున్న తెలుగు రచయితలూ,పండితులూ,
సాహిత్యభిమానులూ, కలుసుకుని తమ తెలుగు సాహిత్యాభిమానాన్నీ, రచనలనీ సహ భాషాభిమానులతో, ఆత్యీయ వాతావరణంలో పంచుకునే వేదికని కల్పించడం.
2.ఈప్రాంతంలో తెలుగు భాష అమలుపై ప్రత్యేక సమీక్ష–ఆచరణ సాధ్యమైన ప్రణాళికలపై చర్చించడం.
3. ఔత్సాహికులైన భాషాభిమానులకు, రచయితలకు రచనా రంగంలో స్వతంత్ర భావాల వ్యక్తీకరణకు ప్రోత్సహించడం.
4. నిష్ణాతులైన సాహిత్యకారుల ఆహ్లాదకరమైన ప్రసంగాలు,పద్యాలు,పాటలు,కవితలు వినే అవకాశం కల్పించడం.
5. మన భాషా సంస్కృతులకు అద్దంపట్టే రంగస్థల నాటక కళాకారులను ప్రోత్సహించడం.

ప్రత్యేక ఆకర్షణలు..

చర్చా వేదికలు, నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, నూతన పుస్తకావిష్కరణలు, ప్రేక్షకులకు పాల్గొనడానికి అవకాశం ఇచ్చే జాతీయాలు, సామెతలు, సరదా సాహిత్య పోటీలు, జానపదాలు, పద్యాలు, తెలుగు భాషా సాహిత్యంలో హాస్య ఘట్టాలు, మాండలీకాలు- వాటి ప్రాముఖ్యత, న్యూ జీలాండ్ మరియు ఆస్ట్రేలియా తెలుగువారి జీవన విధానాలపై కవితలు, కధానికలు, అందరూ అప్పటికప్పుడు పాల్గొనే గొలుసు కథ, పుస్తక విక్రయ శాల, మరన్నో ఉన్నాయి.

- Advertisement -