దిశ హత్యకేసు..ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు

419
disha

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం,హత్య కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దిశ కేసు విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు అనుమతివ్వడంతో మహబూబ్ నగర్ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటికే నిందితులను ఉరి తీయాలని దేశవ్యాప్తంగా ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాతంలో దిశా అనే వెటర్నరీ డాక్టర్‌పై నలుగురు దుండగులు ఘోరంగా హత్యాచారం చేశారు. నిందితులను 24 గంటల్లోనే పట్టుకున్నారు పోలీసులు.

high court gives orders to Fast track court for Disha case…high court gives orders to Fast track court for Disha case

disha case