“పాగల్” గా ఫలక్ నుమా దాస్ హీరో

264
Vishwak Sen

ఈ నగరానికి ఏమైంది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈమూవీ తర్వాత ఫలక్ నుమా దాస్ అనే చిత్రంలో నటించాడు. ఈచిత్రానికి దర్శకత్వం కూడా తనే చేశాడు. ఈమూవీ బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. పక్కా మాస్ సినిమాతో హీరోగా పరిచయమై తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇప్పుడు ఈ యంగ్ హీరో ‘పాగల్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హుషారు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేష్‌రెడ్డి కుప్పిలి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. క్రేజీ లవ్‌స్టొరీగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ చివర్లో ప్రారంభం కానుంది.

ఫలక్‌నుమా దాస్ లాంటి సూపర్ హిట్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో విశ్వక్ సేన్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. ఈమూవీకి సంబంధించిన పూర్తీ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.