రివ్యూ : ఫ‌ల‌క్‌నుమా దాస్‌

338
falaknuma das review

వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది లాంటి చిత్రాలలో మంచిగుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్ సేన్. తాజాగా ఆయన హీరోగా,స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఫలక్ నుమా దాస్. డి. సురేష్‌ బాబు సమర్పణలో వన్మయి క్రియేషన్స్‌ బేనర్‌ పై తెరకెక్కిన ఈ చిత్రంలో మిశ్రా, హర్షిత గౌర్‌, ప్రశాంతి హీరోయిన్స్‌గా నటించారు. పెళ్లిచూపులుదర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ కీలకపాత్రలో నటించగా ఫలక్‌నుమా దాస్‌తో విశ్వక్‌సేన్ ఆకట్టుకున్నారా..?ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం..

కథ:

దాస్‌(విశ్వ‌క్ సేన్‌) ఫ‌ల‌క్‌నామాలోనే ఉంటాడు. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగి,శంకరన్న అనే రౌడీకి ఫ్యాన్ అవుతాడు. ఈ క్రమంలో అందరు దాస్‌ని ఫలక్‌నామా దాస్ అని పిలుస్తుంటారు. చ‌దువుకంటే గొడ‌వ‌ల్లో ముందుంటం,వీరికి పాండు(ఉత్తేజ్‌) స‌పోర్ట్ చేస్తుంటాడు. సీన్ కట్ చేస్తే శంకరన్నను చంపిన రవిరాజుతో బిజినెస్ చేయాల్సి వస్తుంది దాస్‌కి. అయితే ఓ బార్‌లో రవిరాజు బావమరిదితో జరిగిన గొడవ కారణంగా హత్య కేసులో ఇరుక్కుంటాడు దాస్‌…? ఆ హత్య కేసు నుండి దాస్ ఎలా బయటపట్టారు..?ఈ క్రమంలో తన లవ్‌ని సక్సెస్‌ చేసుకుంటాడా..?అన్నది తెరమీద చూడాల్సిందే.

Image result for ఫలక్ నుమా దాస్

ప్లస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ విశ్వక్ సేన్,పాతబస్తీ ఫ్లేవర్‌. సిటీ కుర్రాడి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు విశ్వక్ సేన్‌. పాత‌బ‌స్తీలో ముఖ్యంగా ఫ‌ల‌క్‌నామాలో ఎలాంటి ప‌రిస్థితులుంటాయి. అక్క‌డ ఉండేవాళ్లు ఎలా మాట్లాడుకుంటారు? ఎలా ఉంటారో అలాగే నటించాడు విశ్వ‌క్‌సేన్. ఇన్‌స్పెక్ట‌ర్ పాత్ర‌లో త‌రుణ్ భాస్క‌ర్ ఆకట్టకున్నాడు. ఆయ‌న పాత్ర‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక హీరోయిన్స్ పెద్ద ప్రాముఖ్య‌త లేని పాత్ర‌ధారులుగా క‌న‌ప‌డ‌తారు. మిగితా నటులు తమ పాత్రల పరిధిమేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్‌ కథ,సెకండాఫ్‌.బల‌మైన ఎమోష‌న్స్‌తో మంచి క‌థ‌ను చెప్పి ఉంటే బావుండేది.ఇంట‌ర్వెల్ ట్విస్ట్ కాస్త క్యారీ కాలేక‌పోయింది. సెకండాఫ్ మ‌రి బోర్‌గా అనిపిస్తుంది. స‌న్నివేశాల్లో ఎక్క‌డా ఎగ్జ‌యిట్‌మెంట్ ఉండ‌దు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. వివేక్‌సాగ‌ర్ సంగీతం కొన్ని సీన్స్‌లో త‌న మ్యూజిక్‌తో డామినేట్ చేశాడు. సినిమాటోగ్ర‌ఫీ,ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్ధాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

Image result for ఫలక్ నుమా దాస్
తీర్పు:

మాస్ ఆడియన్స్‌ టార్గెట్‌గా దాస్ అనే కుర్రాడి పాత్ర కీలకంగా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు విశ్వక్ సేన్. హీరో మందు తాగ‌డం, ఫైట్స్ చేయ‌డం,లిప్ లాక్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ వ‌ర‌కు ర‌ప్పించ‌వ‌చ్చు కానీ థియేటర్‌లో కూర్చోబెట్టడం కష్టం. ఫ‌ల‌క్‌నుమా దాస్ విషయంలో అదే జరిగింది. ఓవరాల్‌గా సో..సో అనిపించే మూవీ ఫలక్‌నుమా దాస్.

విడుదల తేదీ:31/05/2019
రేటింగ్: 1.75/5
న‌టీనటులు: విశ్వ‌క్ సేన్‌, తరుణ్ భాస్క‌ర్‌
సంగీతం: వివేక్ సాగ‌ర్‌
నిర్మాత‌లు: క‌రాటే రాజు, చ‌ర్ల‌ప‌ల్లి సందీప్‌
ద‌ర్శ‌క‌త్వం: విశ్వ‌క్ సేన్‌