మొక్కలు నాటిన ఎక్సలెంట్‌ స్కూల్ విద్యార్థులు..

661
- Advertisement -

71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మానసపుత్రిక హరితహారంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌లో ఈరోజు మణుగూరు మండలంలోని ఎక్సలెంట్ స్కూల్లో విద్యార్థులు మొక్కలు నాటడం జరిగింది.

excellent school

అలాగే స్కూల్ కరస్పాండెంట్ మొహమ్మద్ యాకుబ్ షరీఫ్ మాట్లాడుతూ మన పెద్దలు చెప్పినట్టు గాలిని, నీరుని కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితి వస్తుందని అన్నారో ఆ విధంగానే మన దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ దుస్థితి భావితరాలకు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరం ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటవలసిన అవసరం ఎంతైనా ఉంది కనుక ప్రతి ఒక్క విద్యార్థి మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేయాలని ఆయన అన్నారు.

green

- Advertisement -