రివ్యూ : ఎవరు

702
evaru movie review

క్ష‌ణం,అమీ తుమీ,గూఢ‌చారి వంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న హీరో అడివిశేష్. మరోసారి థ్రిల్లర్ మూవీ ఎవరు అంటూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. పీవీపీ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి వెంక‌ట్ రామ్‌జీ దర్శకత్వం వహించగా నవీన్ చంద్ర కీ రోల్ పోషించారు. ట్రైలర్‌,టీజర్‌తో అంచనాలను పెరిగిపోగా సినిమా ఎలా ఉంది…?పోలీస్ ఆఫీసర్‌గా అడవి శేష్ మెప్పించాడా లేదా చూద్దాం…

కథ:

ఓ సాప్ట్ వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే మధ్య తరగతికి చెందిన సమీరా (రెజీనా) తన బాస్‌తో పెళ్లికి సిద్ధపడుతుంది. అయితే ఆ బాస్‌తో ఆమెకు శారీరక సంబంధం లేకపోవడంతో తన స్నేహితుడైన పోలీస్ ఉన్నతాధికారి అశోక్ (నవీన్ చంద్ర)తో సన్నిహితంగా ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఇద్దరు కలిసి తమిళనాడు వెళ్లడం…అక్కడ సమీరాపై అత్యాచారంజరగడం.. అశోక్ హత్య చేయబడటం జరుగుతుంది. అసలు సమీరాపై అత్యాచారం చేసింది ఎవరు…?అశోక్‌ని ఎవరు చంపారనేది తెరమీద చూడాల్సిందే.

Image result for evaru movie

ప్లస్ పాయింట్స్‌ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,ట్విస్ట్స్‌,అడవి శేష్ నటన. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న అడవి శేష్ …నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించాడు. ఫైట్స్‌, యాక్షన్,రొమాంటిక్ సన్నివేశాలను టచ్ చేయకుండా హీరోయిజం పండించాడు. సినిమాకు మరో ప్లస్ పాయింట్ రెజీనా. తన గ్లామర్‌తో సినిమాకు మరింత అందం తీసుకొచ్చింది. కథ మొత్తం హీరోయిన్‌ చుట్టూ తిరుగుతుండటంతో రెజీనాకు మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. మరో పోలీస్ ఆఫీసర్‌గా నవీన్ చంద్ర పోలీస్,నిహాల్ ,వినయ్ వర్మ ,మురళీశర్మ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్‌ :

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్‌ సెకండాఫ్ బోర్ కొట్టించే సన్నివేశాలు,కామెడీ లేకపోవడం. ఫస్టాఫ్‌లో ఉన్నంత గ్రిప్పింగ్ సెకండాఫ్‌లో కాస్త తగ్గుతుంది. ఇంటర్వెల్‌‌ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించినా అక్కడక్కడా లాజిక్‌లు మిస్ అయినట్టు కనిపిస్తాయి.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. అబ్బూరి రవి అందించిన మాటలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. తన కెమెరాపనితనంతో సినిమాను మరో స్ధాయికి తీసుకెళ్లాడు వ‌ంశీ. నేపథ్య సంగీతంతో తన మార్క్ చూపించాడు శ్రీ చరణ్ .ఎడిటింగ్ బాగుంది. పీవీపీ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for evaru movie

తీర్పు:

ఎవరు అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే ఈ చిత్రం. కథలో బలం,ట్విస్ట్‌లు ఉంటే సినిమా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. ఆ పాయింట్‌నే బేస్ చేసుకుని తొలి సినిమా అయినా వెంకట్ రామ్‌ జి అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రేక్షకులను కథలో ఇన్వాల్వ్ చేసి ఏం జరుగుతుందా అనే ఆసక్తిని కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. మొత్తంగా ఈ వీకెండ్‌లో ప్రేక్షకులు థ్రిల్‌కు గురయ్యే మూవీ ఎవరు.

విడుదల తేదీ: 15/08/2019
రేటింగ్: 2.75/5
నటీనటులు: అడవి శేష్,రెజీనా
సంగీతం:శ్రీ చరణ్‌
నిర్మాత:పీవీపీ బ్యానర్
దర్శకత్వం: వెంకట్ రామ్‌ జి