ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌పై ఈటల రివ్యూ…

556
etela rajender
- Advertisement -

ఆయుష్ డిపార్ట్మెంట్ పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల ప్రస్తుత కాలంలో ఆర్గానిక్ ఫుడ్ మీద శ్రద్ద పెరిగింది. అల్లోపతీ మందులతో ఇతర సమస్యలు వస్తున్నాయి అని చాలామంది ప్రాచీన భారతీయ వైద్యం వైపు చూస్తున్నారు. వారి అవసరాలకు అనుగుణంగా ఆయుష్ ఎదగాలి. నమ్మకం పోగొట్టు కోకుండా పని చేయండి. శ్రద్ధ పెట్టీ పని చేయండి. ప్రతి రోజు అన్ని దిస్పెన్సరీ ల్లో డాక్టర్స్ అందుబాటులో ఉండాలి అని ఆదేశించారు.

తాను సమీక్ష నిర్వహించడానికి వచ్చిన గెస్ట్ నీ కాదు మీ కెప్టెన్ ను అని చెప్పారు ఈటల. మీ గౌరవం పెంచే విధంగా పని చేస్తాను మీరు కూడా ప్రజలకు సేవ చేసి ఆయుష్ డిపార్ట్మెంట్ గౌరవం పెంచండి అని కోరారు. ఆయుష్ కింద పని చేస్తున్న ఆయుర్వేద, హోమియో, యునాని విధానాల్లో 839 దిస్పెన్సరీలల్లో కావలసిన వసతుల కోసం 1 కోటి రూపాయలు విడుదల చేశారు.

ఇక నుండి ఆయుష్ లో అవసరం అయ్యే మందులు అన్నీ డిపార్ట్ మెంట్ నే తయారు చేసుకొనే విధంగా యంత్ర పరికరాలు సమకూర్చుకోవడం కోసం సమీక్షలో అనుమతి ఇచ్చారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి సెంట్రల్ డ్రగ్ స్టోర్ ద్వారా మందులు పంపిణీ చేయాలని.. ప్రతి రోజు స్టాక్ పొజిషన్ నమోదు చేయాలని .. రోగికి అవసరం అయిన మోతాదులో ప్యాకింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈటల రాజేందర్.

భారతీయ సంప్రదాయ వైద్య విధానం పై నమ్మకం మరింత పెరిగేలా పనిచేయాలని కోరిన మంత్రి ఈటల. కావలసిన అన్ని సదుపాయాలు అందిస్తామని హామీ ఇచ్చిన మంత్రి. దేశంలో నంబర్ వన్ గా తీర్చి దిద్దలని కోరారు. 20 సంవత్సరాల తరువాత ఒక మంత్రి ఆయుష్ మీద సమీక్ష చేస్తున్నారని.. పునరంకితమై పని చేస్తామని ఆయుష్ విభాగం అధిపతిలు, ఉద్యోగులు మంత్రి కి హామీ ఇచ్చారు.

telangana minister etela rajender review on Ayush Department…telangana minister etela rajender review on Ayush Department…

- Advertisement -