ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి- ఈటెల

311
minister etela rajendar
- Advertisement -

ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అదిలాబాద్ జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. 365 రోజులు ఎమర్జెన్సీ నే..ఒక్కో సీజన్‌లో ఒక్కో రకం జబ్బులు వస్తున్నాయి. ప్రతి రోజు అలెర్ట్ గా ఉండాలి. చలికాలం ఫ్లు జబ్బులు ఎక్కువగా వస్తాయి. అందుకే ముందస్తుగా వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారులు,హెచ్‌ఓడీ లతో ఈ రోజు రేపు సమీక్ష నిర్వహిస్తున్నాం అని మంత్రి ఈటల రాజేందర్ తెలియజేశారు.

స్వైన్ ప్లూతో పాటు ఇతర ప్లూ జబ్బులతో బాధపడే రోగులకు సెపరేట్ వార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, పరికరాలు ఉన్నాయి,మందులు ఉన్నాయి కావున ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసుకోవద్దు. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాము. టీబీని గుర్తించడంలో, చికిత్స అందించడంలో దేశంలో నంబర్ వన్ గా ఉన్నాము. సదుపాయాలు కల్పన, పరిశుభ్రతలో నంబర్ వన్. బస్తీ దావాఖనలు, వెల్నెస్ సెంటర్స్ నిర్వహణలో దేశంలో అగ్రగామిగా ఉన్నామని మొన్ననే అవార్డ్ అందుకున్నామని మంత్రి తెలిపారు.

etela

ప్రస్తుతం 55% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి.. ఇంతకు ముందు కేవలం 30% మాత్రమే ఉంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని కేంద్రాల్లో ఒకే విధంగా కాకుండా.. రోగుల రద్దీని బట్టి, వ్యాధులను బట్టి సిబ్బంది నియామకం చేస్తున్నాం.సెకండరీ కేర్ హాస్పిటల్స్ నీ బలోపేతం చేస్తున్నాం. ఆరోగ్య శ్రీలో ఎక్కువ జబ్బులను ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయిస్తము. హెల్త్‌లో తెలంగాణను మొదటి స్థానంలో నిలబెట్టేందుకు సమిష్టిగా పనిచేయడానికి ఈ రోజు రేపు సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.

24 జిల్లాలో తెలంగాణ డయగ్నస్టిక్స్ నీ ఏర్పాటు చేయబోతున్నాం. 17 బిల్డింగ్స్ కడుతున్నం. క్యాన్సర్ ను ముందే గుర్తించడం కోసం చర్యలు చేపడుతున్నాం. స్కానింగ్ సెంటర్స్ ను పెంచుతున్నాం. మొదటి దశలో గుర్తిస్తే క్యాన్సర్ ను నయం చేసి బ్రతికించు కోవచ్చు.. అదిలాబాద్, వరంగల్ లో రీజినల్ క్యాన్సర్ సెంటర్స్ ఏర్పాటుకు కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. తప్పు చేసిన అధికారులపై శాఖ పరమైన చర్యలు ఉంటాయి. తప్పులు సరి చేసుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని అధికారులను కోరుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

Telangana Health Minister Etela Rajender Held Review Meeting on Medical & Health Department officials..

- Advertisement -