ఆరోగ్యశ్రీ గొప్పగా అమలవుతుందిఃమంత్రి ఈటెల

352
Minister Etela Rajender
- Advertisement -

తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్దరించేందుకు ప్రైవేట్ నెట్ వర్క్ అసుపత్రుల యాజమానులతో మంత్రి ఈటెల రాజెందర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో నేటి నుంచి యాధావిధిగా ఆరోగ్య శ్రీ అందుబాటులోకి రానుంది.

ఈసందర్భంగా వైద్య,ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజెందర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం గొప్పగా అమలవుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగానలో 85లక్షల కుటుంబాలకు ఆరోగ్య శ్రీ వర్తిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కన్నా తెలంగాణ ఆరోగ్య శ్రీ వందశాతం అమలవుతుందన్నారు.

ఆయుష్మాన్ భారత్ కేవలం 25 లక్షల కుటుంబాలకు అమలు చేస్తే తెలంగాణ ఆరోగ్యశ్రీ 85 లక్షల కుటుంబాలకు అందిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా చిన్న చిన్న హాస్పిటల్ కు ఇబ్బంది కలగకూడదనే 520 కోట్ల వరకు చెల్లింపులు చేసినట్లు తెలిపారు. 2007-12 మధ్య జరిగిన ఎంవోయూ లను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది తప్పకుండా చేస్తామని హామి ఇచ్చారు.

- Advertisement -