బతుకమ్మ చీరలు… ఆడబిడ్డలకు పండగ కానుక

441
errabelli

బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకు పండగ కానుక అన్నారు పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా దేవరుప్పుల బతుకమ్మ చీరల పంపిణీ, 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రబెల్లి…బతుకమ్మ పండుగకు ఇంటి ఆడపడుచులను గౌరవించుకోవడం మన సంప్రదాయం అన్నారు.

తెలంగాణ ఆడపడుచులకు ఒక ఇంటి పెద్దగా, పెద్దన్నగా కేసీఆర్ బతుకమ్మ చీరలను కానుకగా ఇస్తున్నారని చెప్పారు. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ సవాళ్లుగా తీసుకుని ఎన్నో పనులు పూర్తి చేశారు. ఇంకా చేయాల్సినవి ఉన్నాయని చెప్పారు.

గత ప్రభుత్వాలకు, కేసిఆర్ పాలనకు తేడా చూడాలన్నారు. గతంలో కరెంటు లేక ఇబ్బంది పడేది. ఇప్పుడు వద్దన్నా కరెంటు వస్తోందన్నారు. గతంలో బోర్లు, బాయిల నీళ్లు తాగేటోళ్లం. బిందెలు పట్టుకుని దూరం పొయ్యేటోళ్లమని చెప్పారు.

ఇప్పుడు కృష్ణా, గోదావరి నీళ్లను తెచ్చి ఇంటింటికి సరఫరా చేస్తున్నాం…మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇస్తోందన్నారు. రైతులు వ్యసాయం చేయాలని , ఇబ్బంది పడొద్దని ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నారని వెల్లడించారు.

dayakar rao

రూ. 2016, రూ.3016 తో ఆసరా పెన్షన్లతో వృద్ధులకు, వికలాంగులకు ఆత్మగౌరవం పెరిగిందన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలను బాగు చెయ్యాలని ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారని తెలిపారు.

మన ఇంటిని, మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి. పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చి దిద్దుకోవాలన్నారు.ప్రతి ఊరిలో ప్రత్యేకంగా స్థలం ఎంపికచేసి పండ్ల మొక్కలను పెంచి మంకీ ఫుడ్ కోర్టులను అభివృద్ధి చేయాలన్నారు. అప్పుడే ఊరిలోకి కోతులు రాకుండా ఉంటాయి.చెట్లు పెంచితేనే వర్షాలు వస్తాయి. అనుమతి ఉంటేనే చెట్లు నరకాలి.ఇంటి ముందు చెత్త వేస్తే జరిమానా విధించేలా గ్రామపంచాయతీ తీర్మానం చేయాలన్నారు. ఆదర్శ గ్రామాలకు గుర్తింపు ఇచ్చి అభివృద్ధిలో ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు ఎర్రబెల్లి.