‘ఎంత మంచివాడ‌వురా’ ట్రైలర్..

513
kalyanram
- Advertisement -

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత మంచివాడ‌వురా`. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణప్రసాద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం రిలీజవుతోంది.

ntr

ఈ నేపథ్యంలో బుధవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ వేడుకలో సినిమా ట్రైలర్ ను ఎన్టీఆర్ ఆవిష్కరించారు. ఈ సంక్రాంతికి సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిదని ట్రైలర్ చెబుతోంది. ఫ్యామిలీ ఎమోషన్..యాక్షన్ ని మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ప్రేమించాలని కళ్యాణ్ రామ్ మెహరీన్ వెంట పడటం… ఎదురించే వాడు రానంత వరకే రా భయపెట్టేవాడి రాజ్యం వంటి భారీ డైలాగులు తో పాటు.. పేరుతో పిలిచే దానికంటే బంధుత్వం పిలిచేదానికి ఎమోషన్ ఎక్కువ వంటి సెంటిమెంట్ డైలాగులు కొసమెరుపు. పల్లెటూరి వాతావరణం లో సాగే స్టోరీ ఇది. కళ్యాణ్ రామ్ డీసెంట్ కుర్రాడిగా గెటప్ బాగా కుదిరింది. మెహరీన్ స్రీన్ పై బబ్లీగా కనిపిస్తోంది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి.

- Advertisement -