అదే చివరి మ్యాచ్‌..ధోని రిటైర్మెంట్..!

421
dhoni
- Advertisement -

భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్‌కు టైం దగ్గరపడింది. తన ఆటతీరుపై విమర్శలు వస్తున్న తరుణంలో ప్రపంచకప్ తర్వాత రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్న ధోని ఈ మేరకు బీసీసీఐ అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

37 ఏళ్ల ధోనీ ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో స‌రైన ఆట‌తీరు ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్నారు. త‌న ఆట‌తీరుతో అటు మాజీ ఆట‌గాళ్ల నుంచి ఇటు అభిమానుల నుంచి కూడా తీవ్ర విమ‌ర్శలు ఎదుర్కొంటున్నాడు. స‌చిన్, గంగూలీ వంటి ద‌గ్గ‌జాలు కూడా ధోనీని విమ‌ర్శించారు. ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ ప్రకటించాలని ధోని నిర్ణయించారట.

ఈ ప్రపంచ‌క‌ప్‌లో భార‌త్ ఆడే చివ‌రి మ్యాచే ధోనీకి కూడా చివ‌రిది కానుంది. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ ఇప్ప‌టికే సెమీ-ఫైనల్‌కు చేరుకోగా ఆ మ్యాచ్‌ కూడా గెలిస్తే ఈ నెల 14న లార్డ్స్ వేదిక‌గా జ‌రుగ‌బోయే ఫైన‌ల్ మ్యాచ్ ఆడుతుంది. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ఆ మ్యాచ్‌తోనే క్రికెట్‌కు స్వ‌స్తి చెప్పాల‌ని ధోనీ భావిస్తున్నాడట‌. ఇప్పటికే ఇప్ప‌టికే టెస్టుల నుంచి వైదొల‌గిన ధోనీ ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో భారత్ ఆడే చివ‌రి మ్యాచ్‌తో అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -