‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ కు హీరోయిన్ దొరికొంది

429
Ntr Heroine For RRR Movie
- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్ ను పెట్టారు. ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇందులో రామ్ చరణ్ కు జోడిగా అలియా నటిస్తోంది. ఎన్టీఆర్ జోడిగా మొదట డైసీని అనుకున్నారు.

కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈమూవీని నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. దీంతో ఎన్టీఆర్ హీరోయిన్ గా ఎవర్ని తీసుకుంటారా అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. అనేక మంది హీరోయిన్ల పేర్లు తెరమీదకు వచ్చినా రాజమౌళికి వారు నచ్చలేదట.

తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సరసన మరో అమెరికా భామను తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అమెరికన్ నటి, గాయని ఎమ్మా రాబర్ట్స్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాల్లో నటించిన ఎమ్మాకు ఇదే తొలి భారతీయ చిత్రం. ఈవిషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

- Advertisement -