ప్రముఖ న్యాయవాది రామ్ జఠ్మలానీ ఇక లేరు..

221

ప్రముఖ న్యాయవాది రామ్ జఠ్మలానీ(95) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు ఈ రోజు ఉదయం ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన 1923లో సెప్టెంబర్ 14న సిఖర్పూర్‌లో జన్మించారు. రామ్ జఠ్మాలనీకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి పలువు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంర్భంగా రామ్ జఠ్మాలానీ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వివిధ హోదాల్లో ఆయన చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు.

Ram Jethmalani

న్యాయవాదిగా ఎంతో పేరుతెచ్చుకున్న ఆయన చారిత్రాత్మక కేసులను ఎన్నో వాదించి గెలుపొందారు.17 ఏళ్ల వయస్సులోనే బాంబే యూనివర్సిటీలో జఠ్మలానీ ఎల్ఎస్బీ చేశారు. ఆయన ముంబయి నుంచి బీజేపీ అభ్యర్థిగా 6, 7 లోక్ సభలకు ఎన్నికయ్యారు. వాజ్‌పాయీ హయాంలో న్యాయ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2010లో జఠ్మలానీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.