జోరుమీదున్న ఈషా రెబ్బా.. ఫ్యాన్స్ కు ముద్దులు

294
Eesha-Rebba
- Advertisement -

అంతకు ముందు ఆ తరువాత సినిమా తో టాలీవుడ్ లో అడుగుపెట్టి, గత సంవత్సరం లో అమీతుమీ, దర్శకుడు సినిమాలలో కనిపించి, ఈ సంవత్సరం లో అ! , బ్రాండు బాబు లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా, ప్రస్తుతం అరవింద సమేత వీర రాఘవ సినిమా లో నటించింది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే అరవింద సమేత సినిమాలో తన పాత్రలో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అన్నది అటుంచితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఈ బ్యూటీ తనను తాను బాగానే ప్రమోట్‌ చేసుకుంది.

Eesha

అరవింద సమేత సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈషా రెబ్బా తనను తాను ప్రమోట్‌ చేసుకున్న తీరును మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమా ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్ లో హీరో ఎన్టీఆర్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లను తెగ పొగుడుతూ మాట్లాడిన ఇష తాజాగా అరవింద సక్సెస్‌ మీట్‌ ఫంక్షన్‌లో నందమూరి అభిమానులను ఓ రేంజ్‌లో ఎత్తుకుంది. తాను కూడా తారక్‌కు వీరాభిమానినని తారక్‌ అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపింది ఈషా. అరవింద సమేత మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నా అంటూనే.. ఈ సెలబ్రేషన్ కి కారణమైన నందమూరి అభిమానులకు ఎప్పటికి గుర్తుండిపోయే గిప్ట్‌ను కూడా ఇచ్చింది ఈ భామ. ఆ గిఫ్ట్ ఏంటంటే ఓ ముద్దు. అవును తారక్‌ అభిమానులకు ఈషా ఓ ఘాటైన ముద్దును కూడా ఇచ్చింది.

Eesha-Rebba

ఈ విజయంలో భాగమైనందుకు – ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు.. అవకాశమిచ్చిన త్రివిక్రమ్ కి థాంక్స్. మళ్లీ మీతో కలిసి పని చేస్తానని భావిస్తున్నాను. తారక్ గారితో పని చేయడం సంతోషం. ఆయన ఎంతో డెడికేటెడ్ స్టార్. పూజా స్వీట్ హార్ట్. ఇంత పెద్ద సక్సెస్ చేసిన అభిమానులందరికీ చాలా కృతజ్ఞతలు తెలిపింది ఈషా. చూడాలి మరి అరవింద్‌ సమేత మూవీతో ఇంత జోష్‌తో కనిపిస్తున్న ఈ బ్యూటీకి తెలుగు పరిశ్రమలో అవకాశాలు ఏ మేరకు వస్తాయో.

- Advertisement -