కాళేశ్వరంపై భట్టి అసత్యప్రచారం:ఈద శంకర్‌ రెడ్డి

490
eeda shankar redy
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌ మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఈద శంకర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 15% వర్క్స్ కూడా కాలేదు.. ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారని కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క అన్నారు.

50వేల కోట్లు ఖర్చు చేశారు డిపిఆర్ ఏంటి అని అడిగారు.. బట్టి విక్రమార్క చదువుకున్న విద్యావంతుడు అనే భావన ఉండేది..- కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాళేశ్వరం ప్రాజెక్టు సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు ఈద.

నిర్దేశించిన ఆయకట్టుకు నీళ్లు ఇయ్యలేని దుష్ట పాలన కాంగ్రెస్‌ది అన్నారు. నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసాయి… బాబ్లీ ప్రాజెక్టు కడుతుండే కాంగ్రెస్ నాయకులు కండ్లు ముసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి రావలనుకుంటే రండి దగ్గరుండి అన్ని వివరాలు అందిస్తామన్నారు.

డిపిఆర్ కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇంజనీర్ లాగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తే వినలేదు. ఎన్ని పంపులు, లిఫ్టులు, మోటార్లు ఉంటాయి.. అసలు నీళ్లు ఎటు నుండి ఎటు వస్తాయో కాంగ్రెస్ నాయకులకు తెలుసా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మూర్ఖులు అని మండిపడ్డ ఈద… ఎస్సారెఎస్పీ మొదటి దశ తప్తే మిగతా దశ నీళ్లు ఇవ్వనేలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి చర్చకు సిద్ధమని ప్రకటించిన ఈద అతి తక్కువ కాలంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్‌ది అన్నారు.

- Advertisement -