నేటి నుంచే పింక్‌బాల్ టెస్టు…

566
ashwin
- Advertisement -

భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. భారత్ -బంగ్లా మధ్య జరిగే తొలి పింక్ బాల్ టెస్టును ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ,బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లుచేయగా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మ్యాచ్ మొదలుకానుంది.

గులాబీ టెస్టు కోసం ఇప్పటికే రెండు జట్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. టీమిండియా బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. ఓపెనర్‌ మయాంక్ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లీ, రోహిత్‌, పుజారా, రహానే తమ బ్యాట్‌కు పని చెబితే బంగ్లా ఆడ్రస్‌ గల్లంతే. షమీ, ఉమేశ్‌, ఇషాంత్‌ లాంటి పేస్‌ గుర్రాల్ని తట్టుకుని బంగ్లా బ్యాట్స్‌మెన్‌ నిలబడటం కష్టం. స్పిన్‌ విభాగంలో అశ్విన్‌, జడేజా కీలకం కానున్నారు. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు.

బంగ్లా బ్యాటింగ్‌లో ముష్ఫికర్‌ రహీమ్‌, మహ్మాదుల్లా, లిటన్‌ దాస్‌ కీలక బ్యాట్స్‌మెన్‌. వీరి రాణింపుపైనే బంగ్లా విజయావకాశాలు ఆధారపడ్డాయి. ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, అబు జాయేద్‌ బౌలింగ్‌లో కీలకం కానున్నారు. పింక్‌ బాల్‌తో వీరిద్దరూ స్వింగ్‌ రాబడితే టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు తిప్పలు తప్పవు.

మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8 గంటల వరకు మ్యాచ్‌ సాగుతుంది. 12.30కు టాస్‌ వేయనుండగా 3 గంటల నుంచి 3.40 వరకు 40 నిమిషాల లంచ్‌ విరామం ఉంటుంది. సాయంత్రం గం. 5.40 నుంచి గం.6.00 వరకు 20 నిమిషాల టీ విరామం ఇస్తారు.

The Eden Gardens in Kolkata will host the Pink Ball (Day-night) Test between India and Bangladesh. … India: Virat Kohli

- Advertisement -