మీ భర్త చీటింగ్ చేస్తున్నాడా…ఈజీగా కనిపెట్టవచ్చు

248
online news portal
- Advertisement -

‘పెళ్లి’ అనేది ‘నూరేళ్ల పంట’ ఒక తరానికీ మరో తరానికీ మధ్య సుమారు ఇరవై ఏళ్ల వ్యత్యాసం వుంటుంది కాబట్టి ఐదు తరాల వరకు మూడు పూలు ఆరు కాయలుగా పెరుగుతూ మాధుర్యాన్ని పెంచి అందరికీ పంచేది. ‘శత ఆయుష్మాన్ భవ’ – ‘ వంద సంవత్సరాలు ఆనందంగా జీవించు’ అనేది పెద్దలందరూ పిల్లలకిచ్చే ఆశీర్వాదం. కానీ అనుకోని కారణాల వల్ల కొంతమంది దాంపత్య జీవితం.. మున్నాళ్ల ముచ్చటగానే మారుతోంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య పరస్పర అవగాహన లేకపోవటం..భర్త చెడు అలవాట్లకు బానిస కావటం వంటివి కారణాలు కావచ్చు. అయితే, ఎంతో అందమైన జీవితాన్ని ఊహించి నట్టింట్లో అడుగుపెట్టిన భార్య…భర్త నుంచి ఎంతో ఆశిస్తుంది. ముఖ్యంగా తన భర్త ఎలాంటి వాడు…అతని ఇష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.

అయితే, కొంతమంది తెలివిగా తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. తమకున్న అక్రమసంబంధాలను దాచడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారిని ఇట్టే పసిగట్టేయోచ్చు అంటున్నారు నిపుణులు. కొన్ని చిన్నచిన్న విషయాలను నిశితంగా పరిశీలిస్తే చాలని వారిని ఈజీగా గుర్తించవచ్చట.

online news portal

()ఇతరులతో ఎఫైర్ నడిపించే వ్యక్తి తన ఫోన్ ను ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకుండా తన దగ్గర ఉంచుకుంటాడు. చివరకు వాష్ రూమ్ వెళ్లినా కూడా అక్కడికి కూడా ఫోన్ తీసుకెళ్తాడు. అంతేకాదు తను ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఫోన్ పాస్ వర్డ్ ను మీతో చెప్పడు.

online news portal

()ముఖ్యంగా మీరిద్దరూ ఒకే రూమ్ లో ఉన్న కూడా మీకు దూరంగా ఉంటాడు. ఇది కచ్చితంగా అతనికి మరో అమ్మాయితో ఎఫైర్ ఉంది అనడానికి సంకేతం. ఒకవేళ మీతో కలిసి ఉన్నట్లుగా నటిస్తుంటాడు. మీతో చాలా అన్ కంఫర్టబుల్ ఫీలవుతుంటాడు. అవసరం ఉన్న లేకున్నా మిమ్మల్ని పొగుడుతూ ఉండడం కూడా అందుకు సంకేతం.

()అతను ఒక విషయాన్ని దాస్తున్నాడంటే అందుకు రిలేటెడ్ గా ఉన్న విషయాలను కవర్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి మీరు ఏదైన అడిగనప్పుడు అన్ని విషయాలకు వివరణ ఇస్తూ ఉంటాడు. అతడు సమాధానం ఇచ్చేటప్పుడు కూడా చాలా చిన్నగా మాట్లాడుతుంటాడు. ఇలా అతని ప్రవర్తన బట్టి మీరూ ఈజీగా తనకున్న ఎఫైర్ ను అర్థం చేసుకోవొచ్చు.

online news portal

()అంతేగాదు అతను నిజంగా మిమల్ని చీటింగ్ చేస్తున్నట్లయితే ఆటోమేటిక్ గా మీలో ఆ ఫీలింగ్ ఏర్పడుతుందట. ఒక విశ్వవిద్యాలయ నిర్వహించిన పరిశోధన ప్రకారం చీటర్స్ గా ఉండే పార్డ్ నర్స్ ను కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తే ఈజీగా బయటపడిపోతారంట.

() సాధారణంగా ఎవరూ కూడా వారి మొబైల్స్ కు వచ్చే టెస్ట్ మెసేజెస్ ను డిలీట్ చెయ్యరు. ఒకవేళ అతను డిలీట్ చేస్తూ ఉన్నాడంటే కచ్చితంగా మిమ్మల్ని చీటింగ్ చేస్తున్నాడని అర్థం. మీకు తెలియకుండా కొన్ని విషయాలు దాచిపెడుతున్నాడని మీరు అర్థం చేసుకోవొచ్చు.

- Advertisement -