ఆర్టీసీ సమ్మె…సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

505
Rtc Strike.jpeg
- Advertisement -

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు సిబ్బందితో బస్సులను నడిపిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. 5రోజులు గడుస్తున్న ఆర్టీసీ కార్మికులు దిగిరాకపోవడంతో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

నేటి నుంచి చాలా మంది ఉర్లలో నుంచి హైదరాబాద్ కు రానుండటంతో రవాణా సౌకర్యానికి ఇబ్బంది కలగకుండా దసరా సెలవులను పొడిగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బస్సులు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం, వివిధ పట్టణాలతో పాటు హైదరాబాద్ లో స్కూల్ బస్సులను లోకల్ సర్వీసులుగా తిప్పుతూ ఉండటంతో కనీసం రెండు రోజుల పాటు సెలవులను పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు సమాచారం.

దీనిపై నేడు ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికారులు తెలిపారు. కాగా ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించకపోవడంతో కొత్త ఉద్యోగులను తీసుకునేందుకు ఫైల్ ను సిద్దం చేయాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్.

- Advertisement -