తెలంగాణలో దసరా సెలవులు పొడగింపు

546
kcr cm
- Advertisement -

తెలంగాణలో ఈనెల 19వరకు దసరా సెలవులను పొడగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎస్ ఎస్ .జోషి. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలల దసరా సెలవులను పొడిగించింది.

ఈ మేరకు దసరా సెలవులను మరో వారం పాటు పొడిగిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబరు 14 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కావాల్సి ఉంది. సమ్మె కారణంగా అక్టోబరు 21న తిరిగి పాఠశాలలు తెరచుకోనున్నాయి.

- Advertisement -