డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల్లో ‘మ‌న్మ‌థుడు 2’

465
nagarjuna
- Advertisement -

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్పుడు డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా హీరో నాగార్జున డ‌బ్బింగ్ చెబుతున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే అవంతికగా న‌టించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ పాత్ర‌కు సంబంధించిన ట‌జీర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌కు కూడా హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుద‌ల‌, ట్రైల‌ర్ రిలీజ్ డేట్స్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు.

న‌టీన‌టులు:కింగ్ నాగార్జున‌,ర‌కుల్ ప్రీత్ సింగ్‌,ల‌క్ష్మి,వెన్నెల‌ కిషోర్‌,రావు ర‌మేష్‌,ఝాన్సీ,దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు,సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ ర‌వీంద్ర‌న్‌,నిర్మాత‌లు: నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌,నిర్మాణ సంస్థ‌లు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 స్టూడియోస్‌,మ్యూజిక్: చైత‌న్య భ‌రద్వాజ్‌,సినిమాటోగ్ర‌ఫీ: ఎం.సుకుమార్‌,ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్‌: ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌,స్క్రీన్‌ప్లే: రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌,ఎడిట‌ర్స్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌, బి.నాగేశ్వ‌ర రెడ్డి,డైలాగ్స్‌: కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌,కాస్ట్యూమ్స్‌: అనిరుధ్ సింగ్‌, దీపికా ల‌ల్వాని,పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌: సి.వి.రావ్‌,డిజిట‌ల్ మార్కెటింగ్‌: నిహారిక గాజుల‌,పి.ఆర్‌.ఒ: వంశీ-శేఖ‌ర్‌, బి.ఎ.రాజు

- Advertisement -