డ్రంక్ అండ్ డ్రైవ్ షూటింగ్..మందుబాబులు పరార్!

189
drunk and drive

వీకెండ్ వచ్చిందంటే మందుబాబుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చాలు వారికి జరిమానాలు విధించడం,కోర్టులో హాజరుపరిచి జైలు శిక్ష పడేలా చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే శనివారం రాత్రి హైదరాబాద్ ఫిల్మ్‌ నగర్‌,షేక్ పేట నాలా సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు.

వాస్తవానికి ఓ సినిమా షూటింగ్ అక్కడ జరిగింది. రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు, పోలీసు వ్యాన్ లు, జూనియర్ ఆర్టిస్టులు, మందుబాబులతో సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా, వారిని చూసి రియల్ పోలీసులని భావించిన మందుబాబులు పలాయనం చిత్తగించారు.

ఈ మార్గంలో తనిఖీలు ఏంట్రా అంటూ తల పట్టుకున్నారు. ఇక సినిమా షూటింగ్ కు వచ్చిన జనం, వారు నిలిపిన వాహనాలతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.