డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. మద్యం మత్తులో మహిళలు..!

429
Drink and Drive
- Advertisement -

హైద్రాబాద్‌లోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో శనివారం రాత్రి ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 32 మంది మందుబాబులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. 16 కార్లు, 16 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరందరికి సోమవారం బేగంపేటలోని ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రంలో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. మంగళవారం కోర్టులో హాజరుపరుస్తారు.

- Advertisement -