ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ద్రావిడ్..

31
rahul dravid

భారత క్రికెట్ వాల్‌గా రాహుల్ ద్రావిడ్ అందించిన విజయాలు ఇప్పటికి ఎవరు మర్చిపోలేరు. జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు…ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు ఒక్కడే వాల్‌గా నిలిచి టీమిండియాకు చిరస్మరణీయ విజయాలను అందించాడు. ఇక అండర్ 19 క్రికెట్ జట్టు కోచ్‌గా భారత్‌ వరల్డ్ కప్‌ గెలవడంలో ద్రావిడ్ పాత్ర మరువలేనిది. మిస్టర్ డిపెండబుల్‌గ, టీమిండియా వాల్‌గా గుర్తింపుతెచ్చుకున్న ద్రావిడ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు ద్రావిడ్. తిరువనంతపురం వేదికగా భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న ఐదో వన్డే ప్రారంభానికి ముందు సునీల్‌ గవాస్కర్ ఈ జ్ఞాపికను అందకున్నాడు.

భారత్ తరపున 164 టెస్టులు, 344 వన్డే మ్యాచ్‌లు ఆడిన ద్రావిడ్ ఈ రెండు ఫార్మాట్లలోనూ 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. భారత్ తరపున హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఐదవ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.