దొరసాని …. ప్రివ్యూ టాక్‌

295
dorasani review

ఎనర్జిట్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా డా.రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న చిత్రం ‘దొరసాని’. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. 1980లో జరిగే పిరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది.

సినిమా హార్ట్ టచింగ్ గా ఉందంటూ ప్రివ్యూ చూసిన వాళ్లు కామెంట్ చేస్తూన్నారు. 1980ల కాలంలో జరిగే దొరసాని కథ ట్రూ అండ్ పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అని కామెంట్ చేస్తున్నారు. ఒక నిజాయితీగల ప్రేమకు ప్రతిరూపమే దొరసాని అని చెబుతున్నారు.

టాలీవుడ్ లో పలువురు యువ దర్శకులతో పాటు కొంత మంది సినీ నటులు కూడా దొరసాని స్పెషల్ షోని వీక్షించారు. ముఖ్యంగా క్లయిమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ హార్ట్ ని టచ్ చేస్తాయని చెబుతున్నారు. మొత్తానికి ఆనంద్ దేవరకొండ – శివాత్మిక రాజశేఖర్ మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నట్లు తెలుస్తోంది.