‘సీఎం సహాయ నిధి’కి వెల్లువెత్తిన విరాళాలు..

413
ktr
- Advertisement -

కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు తోడుగా ఈరోజు కూడా పలువురు భారీగా విరాళాలు అందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం కావాల్సిన చెక్కులను మంత్రి కే తారకరామారావుకు ప్రగతిభవన్‌లో అందించారు. సమాజం ఆపత్కాలంలో ఉన్నప్పుడు ప్రభుత్వంతో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు మరియు వ్యక్తులకు మంత్రి కే తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు మొత్తం 8 కోట్ల 72 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు విరాళం ప్రకటించి,ఇందుకు సంబంధించిన చెక్కులను మంత్రి కేటీఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి కి పంపించారు.

ఈరోజు మంత్రి కేటీఆర్ కి చెక్కులు అందించిన వారి వివరాలు..

• దివీస్ లేబరేటరీస్ 5 కోట్లు.
• గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయలు.
• VIRCHOW పెట్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయలు.
• ఐ ఆర్ ఎ రియాల్టీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ 25 లక్షలు.
• సుచిర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 25 లక్షలు.
• MGB కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ 20 లక్షలు
• మానవీయ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ 20 లక్షలు.

• మాధవరం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, synthochem ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓష న్ స్పార్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, భూపతిరాజు హెల్పింగ్ హాండ్స్, మిరియాల చిన్న రాఘవరావు 10 లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు.

• వీరితోపాటు మహేశ్వరి మైనింగ్ అండ్ ఎనర్జీ 5లక్షలు, నిఖిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు లక్షల చెక్కులను మంత్రి కేటీఆర్ అందించారు.

దివిస్ ల్యాబ్స్ ముఖ్యమంత్రి సహాయనిధి కి ప్రకటించిన ఐదు కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కుని మంత్రి కే తారకరామారావుకి ప్రగతిభవన్‌లో ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ డి. మధుబాబు అందించారు.

- Advertisement -