30 లక్షల మందిపై వేటు…

215
- Advertisement -

అమెరికాలోని అక్రమ వలసదారుల పై వేటుకు వెనకడుగు వేయబోనని కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికాలో కోటి మందికిపైగా అక్రమ వలసదారులు ఉన్నారని, వారిలో క్రిమినల్ రికార్డులున్న 30 లక్షల మందిని దేశం నుంచి వెళ్లగొట్టేందుకు అవసరమైన చర్యలు త్వరితగతిన పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమ వలసదారులపై చర్యలు తప్పవని ట్రంప్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో అమెరికన్లకు ఇచ్చిన అన్ని హామిలని తప్పకుండా నేరవేరుస్తానన్ని ఆయన అన్నారు.

Donald Trump's first 2 hires

డోనాల్డ్ ట్రంప్ శనివారం కొలంబియన్ ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. అమెరికాలో ఆదివారం రాత్రి ప్రసారంకానున్న ఆ కార్యక్రమంలో సరిహద్దు భద్రతపైనా ట్రంప్ కీలక అంశాలను వెల్లడించారు. యూఎస్ లో అక్రమంగా నివసిస్తోన్న వారిలో చాలామంది డ్రగ్స్ డీలర్లు, క్రిమినల్స్, గ్యాంగ్స్ నడిపేవారున్నారు. అలాంటివాళ్లు కనీసం 20 నుంచి 30 లక్షల మంది ఉంటారని అంచనా. వాళ్లందరినీ దేశం నుంచి తరిమేస్తాం. అంతర్గత భద్రతను పటిష్టం చేసుకుంటూనే దేశసరిహద్దుల్లోనూ అవసరమైన మేరకు రక్షణ ఏర్పాటుచేస్తాం. వలసదారులను వెళ్లగొట్టడం ఒక సవాలైతే, అలాంటి వాళ్లు తిరిగి అమెరికాలోకి రాకుండా సరిహద్దుల వద్ద నిఘాను పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే ముందుగా సరిహద్దు భద్రతను పెంచి, తర్వాత వలసదారు వేట కొనసాగిస్తాం అని ట్రంప్ చెప్పారు.

Donald Trump's first 2 hires

కాబోయే అధ్యక్షుడి హోదాలో డోనాల్డ్ ట్రంప్ మొట్టమొదటి అధికారిక నియామకాన్ని చేపట్టారు. అధ్యక్ష భవనం వైట్ హౌస్ ముఖ్య అధికారిగా రెయిన్స్ ప్రైబస్ ను ఎంపికచేశారు. కీలకమైన వ్యూహాత్మక విభాగం అధిపతిగా స్టీవ్ బనూన్ ను నియమించారు. దేశాన్ని ముందుకు నడిపించడంలో విజయవంతమైన బృందాన్ని ఏర్పాటు చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు.

Donald Trump's first 2 hires

ఎన్నికల్లో నా ఓటమికి చాలా కారణాలున్నాయి. చివరి అడుగులో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీ అడ్డుపడ్డారు. ఈ-మెయిల్స్‌ స్కాంపై కొత్త ఆధారాలు దొరికాయని, పునర్విచారణకు ఆదేశించినట్లు కాంగ్రెస్‌ నేతలకు లేఖ రాశారు. ఆ సందేహాలు నిరాధారమైనవి. డైరెక్టర్‌ కోమీ మా గమనాన్ని నిరోధించి నా చరిత్రాత్మక విజయాన్ని అడ్డుకున్నారు’ అని డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ వాపోయారు.

- Advertisement -